Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Full Details of NADU NEDU

15 నుంచి నాడు - నేడు
తొలి దశలో 15 , 715 పాఠశాలల అభివృద్ధి
Full Details of NADU NEDU

 సంక్రాంతి సెలవుల తరువాత మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు అర్హులందరికీ అమ్మ ఒడి
విద్యార్థులకు స్కూల్ కిట్లు . . పాఠశాలల్లో టాయిలెట్లు
 సమీక్షలో ముఖ్యమంత్రి జగన్
ఆంగ్ల మాధ్యమం స్వయం శిక్షణ యాప్ రూపకల్పనకు ఆదేశాలు

పాఠశాలల్లో నాడు నేడు , అమ్మ ఒడి , మధ్యాహ్న భోజనంలో నాణ్య తపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారు లతో సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు . మొదటి దశలో 15 , 715 పాఠ శాలల్లో నాడు - నేడు కింద అభివృద్ధి కార్యక్ర మాలు నిర్వహించాలన్నారు . ఈ నెల 15 నుంచి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు . నాడు - నేడులో భాగంగా రెండో దశ , మూడో దశ కింద చేపట్టాల్సిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు . ఈ దశల కింద స్కూళ్లు , హాస్టళ్లు , అన్ని జూనియర్ , డిగ్రీ కళాశాలల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఈ నెలాఖరులోగా ప్రతిపాదనలు తయారు చేస్తామని అధికారులు వివరించారు . హాస్టళ్లలో పిల్లలకు మంచి టాయిలెట్లు , పడకలు , ఆల్మ రాలు , టేబుళ్లు ఉండాలని సీఎం స్పష్టం చేశారు . చేసే పనుల్లో నాణ్యత ఉండాలని నిర్దేశించారు .

15 నుంచి నాడు - నేడు 

మొత్తంగా రూ . 343 . 55 కోట్లు అదనపు భారం పడుతోందని ముఖ్యమంత్రి తెలిపారు . మధ్యాహ్న భోజనానికి రూ . 1294 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు . సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నాటి నుంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు .

 స్ఫూర్తి నింపేలా అమ్మ ఒడి

 పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించేందుకు నిర్దేశించిన ఈ పథకం తొలి ఏడాదిలోనే స్ఫూర్తి నింపేలా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిం చారు . వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా 75 శాతం హాజరు నిబంధన పాటించా లన్నారు . ఈ విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకు వివరించాలన్నారు . అనాథ పిల్లలకు సంబంధించి అమ్మఒడి డబ్బును సగం ఆశ్రమానికి , మిగిలిన సగం పిల్లల పేరిట డిపాజిట్ చేయాలని సూచించారు . కొన్ని కుటుంబాల్లో 300 పైబడి యూనిట్ల విద్యుత్ వినియోగం ఉందని , ఇందులో ఉమ్మడి కుటుంబా లకు సంబంధించిన పిల్లలు ఉన్నారంటూ క్షేత్ర స్థాయి నుంచి తమకు ప్రతిపా దనలు వస్తున్నాయని అధికారులు తెలిపారు . మరోసారి రీ వెరిఫికేషన్ చేయించి అర్హులైన వారికి తప్పనిసరిగా అమ్మఒడి వర్తింప చేయాలని ముఖ్య మంత్రి స్పష్టం చేశారు . వెబ్ ల్యాండ్ రికార్డులలో తప్పుల కారణంగా కొందరికి లేని భూమి ఉన్న ట్టుగా చూపుతున్నారని , దీనిపై కూడా ఫిర్యాదులు అందుతున్నాయని అధికా రులు సీఎం దృష్టికి తెచ్చారు . వీటిపై పరిశీలించి వెంటనే వారిని అర్హులుగా గుర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు . పాఠశాలలు ప్రారంభించే నాటికి పిల్లలకు పుస్తకాలు , యూనిఫారాలు పంపిణీ చేయాలన్నారు . స్కూల్ కిట్లో భాగంగా 3 జతల దుస్తులు , టెక్స్ట్ , నోట్ పుస్తకాలు , షూ , సాన్లు , బెల్ట్ , స్కూల్ బ్యాగ్ అందించాలన్నారు .

ఆంగ్ల మాధ్య మంపై సమీక్ష 

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న ఆంగ్ల మాధ్యమంపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు . ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వ హిస్తున్నట్లు అధికారులు వివరించారు . స్వయం శిక్షణ కోసం ఉద్దేశించిన యాలను కూడా వెంటనే రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Full Details of NADU NEDU"

Post a comment