Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news for SBI customers up to Rs 50,000

SBI కస్టమర్లకు శుభవార్త రూ.50,000 వరకు లిమిట్!
Good news for SBI customers up to Rs 50,000

దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు వర్చువల్ డెబిట్ కార్డు ఫెసిలిటీని అందిస్తోంది. ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సాయంతో దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఈకామర్స్ లావాదేవీలకు ఈ కార్డును ఉపయోగించుకోవచ్చు. వీసా కార్డు ఉపయోగించే ఏ ఆన్‌లైన్ స్టోర్‌లోనైనా ఎస్‌బీఐ వర్చువల్ డెబిట్ కార్డును ఉపయోగించొచ్చు. రెగ్యులర్ ప్లాస్టిక్ కార్డు ఎలా పనిచేస్తుందో.. ఇది కూడా అలానే పనిచేస్తుంది. ఎస్‌బీఐ వర్చువల్ కార్డ్స్‌తో పలు ప్రయోజనాలు పొందొచ్చు. అవేంటో చూద్దాం.. ఎస్‌బీఐ వర్చువల్ కార్డ్ మీ అకౌంట్ వివరాలను, ప్రైమరీ కార్డు సమాచారాన్ని దాచేస్తుంది. వ్యాపారులకు ఈ వివరాలు ఏవీ చేరవు.
దీంతో మోసపూరిత లావాదేవీలకు ఛాన్స్ ఉండదు. ఎస్‌బీఐ వర్చువల్ కార్డు వాలిడిటీ కేవలం 48 గంటలు మాత్రమే. ఆ తర్వాత వర్చువల్ కార్డు పనిచేయదు. స్టేట్ బ్యాంక్ వర్చువల్ కార్డును క్రియేట్ చేసుకోవాలన్నా, ఆ కార్డును ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లకు ఉపయోగించాలన్నా కచ్చితంగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
కార్డు ద్వారా అకౌంట్‌లోని డబ్బులను వ్యాపారలుకు చెల్లించొచ్చు. రూ.100 నుంచి రూ.50,000 వరకు ట్రాన్సాక్షన్లకు వర్చువల్ కార్డును ఉపయోగించుకోవచ్చు. ఈ ఎస్‌బీఐ వర్చువల్ కార్డును ఒక్కసారి మాత్రమే వినియోగించగలం. తర్వాత తిరిగి ఈ కార్డును వాడటం సాధ్యం కాదు. లావాదేవీ విలువ ఎంత ఉంటుందో అంతే మొత్తం మీ అకౌంట్ నుంచి కట్ అవుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news for SBI customers up to Rs 50,000"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0