good news: good news for private employees
Good News : ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ . . . సెలవులపై కేంద్రం తీసుకోబోయే నిర్ణయమిదే.
ప్రైవేట్ సెక్టార్‌లో ఇలా పురుషులకు సెలవులు ఇచ్చే కంపెనీలు కొన్ని మాత్రమే . చాలావరకు ప్రైవేట్ కంపెనీలు ఇలాంటి సెలవుల్ని ఇవ్వట్లేదు . అందుకే దీని కోసం ఓ చట్టం చేయాలని కార్మిక శాఖ భావిస్తోంది .
ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న పురుష ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల లాగా ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా పితృత్వ సెలవులు అమలు చేయనుంది. 'సీఎన్‌బీసీ ఆవాజ్'కు కార్మిక శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం పెటర్నిటీ లీవ్ కోసం ప్రత్యేకంగా జాతీయ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్-DOPT విభాగంతో, పరిశ్రమ వర్గాలతో కేంద్రం చర్చలు జరుపుతోంది. రానున్న రోజుల్లో పరిశ్రమ వర్గాలు, ట్రేడ్ యూనియన్లతో ప్రభుత్వం చర్చల్ని జరిపి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పితృత్వ సెలవులకు సంబంధించి భారతదేశంలో ఎలాంటి నేషనల్ పాలసీ లేదు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 15 రోజులు పెటర్నిటీ లీవ్ తీసుకోవచ్చు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా తమ పురుష ఉద్యోగులకు 15 రోజులు పెయిడ్ లీవ్ ఇస్తున్నాయి.
ప్రైవేట్ సెక్టార్‌లో ఇలా పురుషులకు సెలవులు ఇచ్చే కంపెనీలు కొన్ని మాత్రమే. చాలావరకు ప్రైవేట్ కంపెనీలు ఇలాంటి సెలవుల్ని ఇవ్వట్లేదు. అందుకే దీని కోసం ఓ చట్టం చేయాలని కార్మిక శాఖ భావిస్తోంది. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పితృత్వ సెలవులు వర్తించేలా చట్టం రూపొందించే అవకాశముంది. అంతేకాదు... 15 రోజుల పితృత్వ సెలవుల్ని కూడా పొడిగించాలని భావిస్తోంది. అయితే మాతృత్వ సెలవులు 26 వారాల వరకు ఇవ్వాలన్న నిబంధన ఉంది. కానీ... పురుషులకు పితృత్వ సెలవుల్ని పొడిగించడం ఎంతవరకు సాధ్యమవుతుందన్న చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం భారతదేశంలో శ్రామిక వర్గంలో 70 శాతం పురుషులే. కాబట్టి వారికి ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. గరిష్టంగా ఒక నెల వరకు సెలవులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

0 Response to "good news: good news for private employees"
Post a Comment