Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The trouble with local elections for teacher transfers

  • టీచర్ల బదిలీలకు స్థానిక ఎన్నికల గండం?..
  • స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ఈరోజు హైకోర్టు స్పందించే అవకాశం.
  • కోర్టు స్పందన మేరకే నిర్ణయం..
  • బదిలీలకు సంబంధించిన ఫైలు ఆర్ధిక శాఖ వద్దకు..
  • ఫైల్ ను త్వరలో క్లియర్ చేస్తామని ఆర్ధిక శాఖ వర్గాలు వెల్లడి..
The trouble with local elections for teacher transfers

ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన ఫైలు సాధారణ పరిపాలన శాఖ ( జీఏడీ ) నుంచి ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి ఆదినారాయణ వద్దకు చేరింది . వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని , పెర్ఫా ర్మెన్స్ పాయింట్లు ఎత్తివేయాలని , సర్వీస్ పాయింట్ల ప్రాతిపదికగా చేపట్టేందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనల ఫైలుకు జీఏడీ ఆమోదం తెలిపింది . ఫైలును పరిశీలించి త్వరలోనే క్లియర్ చేస్తామని ఆర్థికశాఖ వర్గాలు తెలి పాయి . అయితే స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై శుక్రవారం హైకోర్టు స్పందించే తీరును బట్టి టీచర్ల బదిలీలు జరపాలా ? వద్దా ? అనేది ప్రభుత్వం నిర్ణ యించే అవకాశం ఉందని సమాచారం . బదిలీలపై ఉపాధ్యాయ లోకం ఉత్కంఠతో ఎదురు చూస్తోంది . సుదీర్ఘకాలంగా మారుమూల ప్రాంతాల్లో , భార్యాభర్తలు వేర్వేరు ప్రదేశాల్లో పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్న వేలాదిమంది ఉపాధ్యాయుల బది లీలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు . డీఎస్సీ - 2008 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు కేటగిరీ - 3 , 4 పాఠశాలల్లో చేరి ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలైంది . ఒకే పాఠశాలలో తొమ్మిదేళ్లు పూర్తయిన వారికి కేటగిరీ - 3 , 4 పాఠ శాలల వల్ల సర్వీసు పాయింట్లు ఎక్కువ వస్తాయి . దీనివల్ల తాము కోరుకున్న , సొంత మండలంలోని పాఠశాలలకు బదిలీ కావచ్చని వారు భావించారు . సంక్రాంతి సెలవుల్లో టీచర్ల బదిలీలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్వయంగా ప్రకటించారు . అయితే , జనవరిలో సంక్రాంతి సెలవుల కంటే ముందుగానే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని , కోడ్ కారణంగా ఎన్నికలు పూర్తయ్యే వరకు బదిలీలు చేపట్టరాదని సర్కారు భావిస్తున్నట్లు సంకే తాలు వస్తున్నాయి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The trouble with local elections for teacher transfers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0