Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

In the inaugural session of the ammavadi program. .  CM Jaganmohan Reddy Decisions. .

ALSO READ:

CHECK YOUR AMMAVADI



  • అమ్మఒడి ప్రారంభ సభ  లో . . జగన్ కీలక నిర్ణయాలు . .


    • In the inaugural session of the ammavadi program. .  CM Jaganmohan Reddy Decisions. .

      • నవరత్నాలు ' లో భాగంగా ' అమ్మ ఒడి ' పథకాన్ని సీఎం జగన్ చిత్తూరులో ప్రారంభించారు .
      • చదువు అనేది నిజంగా పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అని . . . ఇదే నిజమైన సంపద అని జగన్ అన్నారు . ఇదే ఉద్దేశంతోనే రాజ్యాంగంలో చదువును ప్రాథమిక హక్కుగా పేర్కొన్నారని వివరించారు .
      • పిల్లలను చదివించే పరిస్థితి ఇళ్లలో ఉండాలని . . . స్కూళ్లు బాగుండాలని జగన్ అన్నారు . తరగతి గదుల్లో పాఠం వినాలన్నా పేదింటి పిల్లల కడుపు నిండాలని అన్నారు .
      • ఆ దిశలో ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ . . . అందులో భాగంగానే అమ్మ ఒడి పథకం ప్రారంభిస్తున్నామని తెలిపారు .
      • ఒకటి నుంచి ఇంటర్ వరకు పిల్లలను చదివిస్తున్న పేదింటి తల్లుల ఖాతాలో నేరుగా రూ . 15 వేలు ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుడుతున్నామని సీఎం జగన్ తెలిపారు .
      • వారికి ఏమైనా అప్పులు ఉంటే , ఈ మొత్తం బ్యాంకులు జమ చేసుకోకుండా అన్ ఇన్కమ్ బర్డ్ ఖాతాల్లో ఆ మొత్తం వేస్తున్నామని జగన్ వివరించారు .
      • నేడు 42,12,186 లక్షల మంది తల్లులకు , తద్వారా 81,72,224 మంది పిల్లలకు మేలు కలిగే విధంగా రూ . 6318 కోట్లు ఇస్తున్నామని జగన్ ప్రకటించారు .
      •  ఈ పథకంలో లబ్ది పొందే పిల్లలకు తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉండాలన్నది వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు .
      • అయితే ఈ ఏడాది మాత్రం 75 శాతం హాజరు నిబంధనను మినహాయించామని జగన్ తెలిపారు .
      • అమ్మ ఒడి పథకాన్ని ఒకటి నుంచి 10వ తరగతి వరకు మాత్రమే అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినా ఇంటర్ వరకు పొడిగించామని జగన్ అన్నారు .
      • పిల్లల చదువు కోసం మరో అడుగు కూడా వేశామని . . . అదే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు .
      • ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను ఈ వేదిక నుంచి ఒకటే అడుగుతున్నానని . . . మీ పిల్లలను ఇంగ్లీష్ మీడియమ్ చదువులు చదివించాలా ? వద్దా ? మీరే చెప్పండని అన్నారు .
      • ఇంతకాలం తెలుగు మీడియమ్ లో చదివిన పిల్లలు ఇంగ్లిష్ మీడియమ్ చదవడానికి కొన్ని ఇబ్బందులు వస్తాయని జగన్ అన్నారు .
      • అందుకే వారికి బ్రిడ్జి కోర్సులు తీసుకు వస్తున్నామని జగన్ వివరించారు . టీచర్లకు కూడా శిక్షణ మోడ్యుల్స్ తయారు చేస్తున్నామని . . . తెలుగును తప్పనిసరి సబ్జెక్టు చేశామని అన్నారు .
      • ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా మార్చబోతున్నామని . . . మధ్యాహ్న భోజనం మెనూలో కూడా సమూలు మార్పులు చేస్తున్నామని జగన్ తెలిపారు .
      • స్కూళ్లు తెరవగానే పిల్లలకు ఒక కిట్ ఇస్తామని . . . 3 జతల యూనిఫామ్స్ , పుస్తకాలు , బూట్లు , సాక్సులు , బెల్టుతో కూడిన ఒక స్కూల్ బ్యాగ్ కిట్ ఇస్తామని జగన్ అన్నారు .
      • జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయబోతున్నామని తెలిపారు .
      • తొలుత జనవరి , ఫిబ్రవరిల రూ . 10 వేలు , ఆ తర్వా త జూలై , ఆగస్టులో మిగిలిన రూ . 10 వేలు ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు 
      • అర్హత ఉన్నా , ఎవరికైనా ఈ పథకంలో వారికి లబ్ది కలగకపోతే మరో నెల రోజుల సమయం ఇస్తున్నామని జగన్ అన్నారు .
      • వచ్చే నెల 9వ తేదీలోగా మీ పేర్లు నమోదు చేసుకోండి . వారికి ఆర్థిక సహాయం చేస్తామని . . . అందువల్ల వెంటనే గ్రామ సచివాలయాలకు వెళ్లి , మీ పేర్లు నమోదు చేసుకోండని తెలిపారు .

      SUBSCRIBE TO OUR NEWSLETTER

      Seorang Blogger pemula yang sedang belajar

      0 Response to "In the inaugural session of the ammavadi program. .  CM Jaganmohan Reddy Decisions. ."

      Post a Comment

      google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0