Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

jobs: good news ... 4893 central government jobs for inter-passengers

Jobs: గుడ్ న్యూస్... ఇంటర్ పాసైనవారికి 4893 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

కొద్ది రోజుల క్రితం ఇంటర్ పాసైనవారిని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నియమించేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ CHSL (10+2) ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే

ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఖాళీల వివరాలను ప్రకటించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇంటర్ అర్హతతో 4893 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు నోటీస్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. దరఖాస్తుకు జనవరి 10 చివరి తేదీ. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ CHSL (10+2) ఎగ్జామ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) / జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (JSA)- 1269 పోస్టల్ అసిస్టెంట్ (PA) / సార్టింగ్ అసిస్టెంట్ (SA)- 3598
డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)- 26

ఎలక్షన్ కమిషన్, ఇంటెలిజెన్స్ బ్యూరో, వివిధ మంత్రిత్వ శాఖల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్.
ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో Candidates Corner సెక్షన్‌లో Tentative Vacancy లింక్‌లో తెలుసుకోవచ్చు.
విద్యార్హత- లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) / జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (JSA), పోస్టల్ అసిస్టెంట్ (PA) / సార్టింగ్ అసిస్టెంట్ (SA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టులకు 12వ తరగతి పాస్ కావాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టులకు సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌తో 12వ తరగతి పాస్ కావాలి.
వయస్సు- 2020 జనవరి 1 నాటికి 18 నుంచి 27 ఏళ్లు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, అన్‌రిజర్వ్‌డ్ వికలాంగులకు 10 ఏళ్లు, అన్‌రిజర్వ్‌డ్ ఓబీసీలకు 13 ఏళ్లు, అన్‌రిజర్వ్‌డ్ ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఫీజు- రూ.100

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "jobs: good news ... 4893 central government jobs for inter-passengers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0