jio Wi - Fi Calling: Another good news for Jio customers. . . WiFi calling for free.
Jio Wi - Fi Calling : జియో కస్టమర్లకు మరో శుభవార్త . . . ఉచితంగా వైఫై కాలింగ్.
Reliance Jio Wifi Calling | కస్టమర్లు ఏ వైఫై నెట్వర్క్ అయినా ఉపయోగించుకొని జియో వైఫై కాలింగ్ చేసుకోవచ్చు . VoLTE లేదా వైఫై ద్వా రా వాయిస్ , వీడియో కాల్క సులువుగా మారొచ్చు . జియో వైఫై కాలింగ్ దాదాపు అన్ని ప్రధాన స్మార్ట్ ఫోన్లల్లో పనిచేస్తుంది .
— ఆకాశ్ అంబానీ, డైరెక్టర్, జియో
Reliance Jio Wifi Calling | కస్టమర్లు ఏ వైఫై నెట్వర్క్ అయినా ఉపయోగించుకొని జియో వైఫై కాలింగ్ చేసుకోవచ్చు . VoLTE లేదా వైఫై ద్వా రా వాయిస్ , వీడియో కాల్క సులువుగా మారొచ్చు . జియో వైఫై కాలింగ్ దాదాపు అన్ని ప్రధాన స్మార్ట్ ఫోన్లల్లో పనిచేస్తుంది .
రిలయెన్స్ జియో యూజర్లకు మరో శుభవార్త. వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది రిలయెన్స్ జియో. ఇందుకోసం అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఏ వైఫై నెట్వర్క్‌లో అయినా ఈ సర్వీస్ పనిచేస్తుంది. ప్రస్తుతం 150 స్మార్ట్‌ఫోన్ల ద్వారా వైఫై వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. కేవలం డేటా మాత్రమే ఖర్చవుతుంది. కొన్ని నెలలుగా వైఫై ద్వారా వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ చేసుకునే ఫీచర్‌ని పరీక్షిస్తోంది రిలయెన్స్ జియో. జనవరి 8న దేశవ్యాప్తంగా ఈ సర్వీస్‌ని ప్రారంభించింది. కస్టమర్లు ఏ వైఫై నెట్వర్క్ అయినా ఉపయోగించుకొని జియో వైఫై కాలింగ్ చేసుకోవచ్చు. VoLTE లేదా వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్‌కి సులువుగా మారొచ్చు. జియో వైఫై కాలింగ్ దాదాపు అన్ని ప్రధాన స్మార్ట్‌ఫోన్లల్లో పనిచేస్తుంది.
కస్టమర్ల సమస్యల్ని గుర్తించి పరిష్కరించడానికి, అనుభవాన్ని పెంచడానికి సరికొత్త ఆవిష్కరణల్ని జియో అందిస్తోంది. ఈ పరిస్థితిలో సగటు జియో వినియోగదారుడు నెలకు 900 నిమిషాల వాయిస్ కాల్స్ చేస్తున్నట్టు గుర్తించాం. కస్టమర్ల సంఖ్య పెరుగుతున్నందున వాయిస్ కాలింగ్ అనుభవాన్ని పెంపొందించేందుకు జియో వైఫై కాలింగ్ సర్వీస్‌ని ప్రారంభించాం. ఇప్పటికే VoLTE నెట్‌వర్క్‌ను మొదటిసారి ఇండియాకు పరిచయం చేసిన ఘనత కూడా జియోదే.
— ఆకాశ్ అంబానీ, డైరెక్టర్, జియో
0 Response to "jio Wi - Fi Calling: Another good news for Jio customers. . . WiFi calling for free."
Post a Comment