Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Welcome to ideal education

  • ఆదర్శ విద్యకు ఆహ్వానం..
  • ఫిబ్రవరి 7 వరకూ దరఖాస్తుల శ్వీకరణ..
  • ఏప్రిల్ 5న ప్రవేశ పరీక్ష నిర్వహణ..
  • అర్హతలు-రిజర్వేషన్లు..
  • దరఖాస్తు విధానం ఇలా..
Welcome to ideal education


 ఆంగ్ల మాధ్యమంలో చదువుకో వాలనుకునే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు వరంగా మారాయి . జిల్లా వ్యాప్తంగా 16 పాఠశాలలు ఉన్నాయి . ప్రతీ సం వత్సరం 16 వందల మంది విద్యార్థులకు 6వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు . ఏటా ఆరో తరగతిలో ఒక్కో పాఠశాలలోను వంద మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు . ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎటువంటి ఫీజులు లేకుండా ఉచితంగా చదువుకోవచ్చు . కంప్యూటర్ ల్యాబ్స్ , సైన్స్ ల్యాబ్స్ , డిజటల్ క్లాస్ రూమ్స్ , అత్యుత్తమ గ్రంథాలయాలు , మరెన్నో సౌకర్యాలతో కూడిన ప్రత్యేక శిక్షణను పొందవచ్చు .

 అర్హతలు ఇవీ . . .

 2018 - 19 , 2019 - 20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5 తరగతులు చదివిన వారై ఉండాలి . ఓసీ , బీసీ లకు చెందిన వారు 01 - 09 - 2008 నుంచి 31 - 08 - 2010 మధ్య , ఎస్సీ , ఎస్టీ విద్యార్థులైతే 01 - 09 - 2008 నుంచి 31 - 08 - 2010 మధ్య - జన్మించి ఉండాలి . 

దరఖాస్తు ఇలా . . . 

విద్యార్థులు ఏపీ ఆన్లైన్ లేదా మీ సేవా కేం ద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలి . ఓసీ , బీసీ విద్యార్థులు రూ . 100 , ఎస్సీ , ఎస్టీ విద్యార్థులు రూ . 50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది . దరఖాస్తుతో పాటు ఆధార్ , కులం , ఆదాయం , రేషన్‌కార్డు , ఒక పాస్ఫోటో , విద్యార్హత సరి ఫికెట్ , తదితర పత్రాలను ఆయా మండల కేం ద్రాల్లో గల ఆదర్శపాఠశాలల్లో ఫిబ్రవరి 1వ తేదీలోగా అందజేయాలి .

 రిజర్వేషన్ల తీరు . . 

15 శాతం ఎస్సీలకు , 6 శాతం ఎస్టీలకు , 29 శాతం బీసీలకు ( 7శాతం బీసీ ఏ , 10 శాతం బీసీ - బి , బీసీ - సిలకు ఒక్క శాతం , బీసీ - డీలకు 7శాతం , బీసీ - ఈలకు 4శాతం ) కేటాయింపులు ఉంటాయి . దివ్యాంగులకు 3శాతం , బాలికలకు 33 . 33శాతం సీట్లను కేటాయించారు . నిర్దేశిం చిన విభాగాల్లో అభ్యర్థులు లేకపోతే ఇతర గ్రూపుల నుంచి భర్తీ చేస్తారు . 50 శాతం సీట్లు ఇతర కులాలకు నిర్దేశించారు . 

ఏప్రిల్ 5న రాత పరీక్ష . . .

 దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఆయా మండల కేంద్రాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు . తెలుగు , ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు . 5వ తరగతి సామర్థ్యానికి అనుగుణంగా తెలుగు , గణితం , పరిసరాల విజ్ఞానం , ఆంగ్ల నైపుణ్యంపై 25 మార్కుల చొప్పున ఐచ్చిక పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి . ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తారు . ఓసీ , బీసీలకు కనీస అర్హత మార్కులు 50 , ఎస్టీ , ఎస్సీ విద్యార్థులకు 35 మార్కులు తప్పక సాధించాలి . 

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి 

 పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించే దిశగా ప్రభుత్వం ఆదర్శపాఠ శాలలను ప్రభుత్వం నెలకొల్పింది . ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశం చక్కని అవకాశంగా విద్యార్థుల తల్లి దండ్రులు భావిస్తున్నారు . నూతన భవనాలు , విశాలమైన తరగతి గదులు , ఎన్నో మెరుగైన సౌకర్యాలు కల్పించ డంతో ఈ పాఠశాలలకు ఆదరణ పెరిగింది . 

- ఎన్ . అనిత , 
ఆదర్శపాఠశాల ఇన్ చార్జ్ ప్రిన్సిపాల్ ,
 ఎల్ . కోట మండలం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Welcome to ideal education"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0