Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Modi Sarkar is a good offer for those who want to buy a house

ఇల్లు కొనాలనుకునే వారికి మోదీ సర్కార్ మంచి ఆఫర్!
Modi Sarkar is a good offer for those who want to buy a house

రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో పనిలేకుండా, వివిధ సైట్లలోకి వెళ్లి సెర్చ్ చేయకుండానే నచ్చిన ఇల్లు కొనుగోలు చేసే ఆప్షన్ ఒకటి అందుబాటులో ఉంది. 
కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇంటి కొనుగోలుదారులు, రియల్టర్ల కోసం సరికొత్త పోర్టల్‌ 'HousingForAll.com'ను ఆవిష్కరించింది. గృహ, పట్టణ వ్యవహారాల కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ఈ వెబ్‌సైట్‌ను లాంచ్ చేశారు. ఇండియన్ రియల్ ఎస్టేట్‌కు సంబంధించి ఈ వెబ్‌సైట్ మరో అమెజాన్ స్థాయికి ఎదగొచ్చని అభిప్రాయపడ్డారు. రియల్ ఎస్టేట్ రంగంలోని కొనుగోళ్లకు సంబంధించి హౌసింగ్ ఫర్ ఆల్ వెబ్‌సైట్ ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని మిశ్రా తెలిపారు. కొనుగోలుదారుల సమస్యల పరిష్కారానికి సైట్‌లోనే ప్రత్యేకమైన గ్రీవెన్స్ పరిష్కార వ్యవస్థను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు
కొత్త పోర్టల్ ద్వారా రియల్టర్లు మాత్రమే కాకుండా ఇంటి కొనుగోలుదారులు కూడా ప్రయోజనం పొందొచ్చని తెలిపారు. కొత్త పోర్టల్‌లో కేవలం రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టులు మాత్రమే లిస్ట్ చేస్తారు. అంటే మీరు కొనుగోలు చేయాలని భావించే ఇంటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రెరా రిజిస్ట్రేషన్ ఉంటుంది.

అలాగే పూర్తయిన ప్రాజెక్టుల వివరాలే పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. అందువల్ల నచ్చిన ఇంటిని వెంటనే కొనుగోలు చేయవచ్చు. హౌసింగ్ ఫర్ ఆల్ వెబ్‌సైట్ సేవలు తొలిగా రియల్ ఎస్టేట్ డెవలపర్లకు అందుబాటులోకి వస్తాయి. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 వరకు సైట్ సేవలను వీళ్లు ఉపయోగించుకోవచ్చు.

వారి ప్రాజెక్టుల వివరాలను సైట్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ డెవలపర్లు వారి ప్రాజెక్టులు వివరాలను అప్‌డేట్ చేసిన తర్వాత కస్టమర్లకు ఈ సైట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. అంటే ఫిబ్రవరి 14 నుంచి ఇంటి కొనుగోలుదారులకు ఈ సైట్ సర్వీసులు లభిస్తాయి. ఇల్లు కొనుగోలు చేయాలని భావించే వారు ఫిబ్రవరి 14 నుంచి నచ్చిన హోమ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

అందుబాటులోకి ఆఫర్లు కూడా తెలుసుకోవచ్చు. ఇలా నచ్చిన ఇంటిని ఎంపిక చేసుకున్న తర్వాత మార్చి 1 నుంచి 31 మధ్యలో కొనుగోలు చేయవచ్చు. పోర్టల్ ద్వారా మార్కెట్‌లో ఉత్తమ ధరకు ఇంటిని కొనుగోలు చేయొచ్చు. ఇంటి కొనుగోలుదారులు సైట్‌లోకి వెళ్లి డైరెక్ట్‌గానే నచ్చిన ఇంటిని బుక్ చేసుకోవచ్చు.

దీనికి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కనీసం రూ.25,000తో నచ్చిన హోమ్‌ను రిజర్వు చేసుకోవలసి ఉంటుంది. దాదాపు 1,000కి పైగా ప్రాజెక్టుల వివరాలు సైట్‌లో అందుబాటులోకి రావొచ్చనే అంచనాలున్నాయి. మీరు రూ.25,000తో నచ్చిన ఇంటిని బుక్ చేసుకున్న తర్వాత ఏమైనా ఇబ్బందులు తలెత్తితే మీ డబ్బును మీకు రిఫండ్ చేస్తారు.

మీరు ఇల్లు నచ్చకపోతే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. అలాంటప్పుడు మీరు బుక్ చేసుకున్న డబ్బును వెనక్కి ఇచ్చేస్తారు. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఒకవేళ ఎంపిక చేసుకున్న ఇల్లు విక్రయమైతే వెంటనే ఆ నోటిఫికేషన్ కస్టమర్లకు వస్తుంది.

హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన పలు సమాఖ్యలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. క్రెడాయ్ ఎంసీహెచ్ఐ, సీఐఐ, ఫిక్కీ, అసోచామ్, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ), ఇండియన్ మర్చంట్ చాంబర్స్ (ఐఎంసీ) వంటివి భాగస్వామ్యమయ్యాయి. కొత్త హౌసింగ్ ఫర్ ఆల్ వెబ్‌సైట్ రియల్ ఎస్టేట్ రంగ వృద్ధికి దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా విక్రయం కానీ రెసిడెన్షియల్ యూనిట్లు కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయని తెలిపాయి. ఇంటి కొనుగోలుదారులకు కూడా ప్రయోజనం లభిస్తుందని, రెరా ప్రాజెక్టుల వల్ల ఇబ్బందులు ఉండవని వివరించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Modi Sarkar is a good offer for those who want to buy a house"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0