IRCTC: The IRCTC says not to book tickets on that website
IRCTC: ఆ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేయొద్దంటున్న IRCTC.
IRCTC Tourism ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ను పోలినట్టు ఉన్న నకిలీ వెబ్‌సైట్ గురించి ఐఆర్‌సీటీసీకి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ఐఆర్‌సీటీసీ అప్రమత్తమైంది.
IRCTC Tourism ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ను పోలినట్టు ఉన్న నకిలీ వెబ్‌సైట్ గురించి ఐఆర్‌సీటీసీకి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ఐఆర్‌సీటీసీ అప్రమత్తమైంది.
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC... భారతీయ రైల్వేకు సంబంధించిన సేవల్ని అందించే అధికారిక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఇది. టికెట్ బుకింగ్ దగ్గర్నుంచి కేటరింగ్ వరకు అనేక సేవల్ని అందిస్తోంది ఐఆర్‌సీటీసీ. అంతేకాదు... ఐఆర్‌సీటీసీకి వేర్వేరు విభాగాలున్నాయి. అందులో టూరిజం ప్లాట్‌ఫామ్ ఒకటి. ఇందుకోసం ప్రత్యేకంగా https://www.irctctourism.com/ వెబ్‌సైట్ ఉంది. దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశాలకూ టూర్ ప్యాకేజీలను ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా అందిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. అయితే ఇటీవల ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ను పోలినట్టు ఉండే నకిలీ వెబ్‌సైట్ పర్యాటకుల్ని నిండా ముంచేస్తోంది. www.irctctour.com పేరుతో ఆ వెబ్‌సైట్ టూరిస్టులకు గాలం వేస్తోంది. అంతేకాదు... మొబైల్ నెంబర్ 9999999999, ల్యాండ్ లైన్ నెంబర్ +91 6371526046, ఇమెయిల్ ఐడీ irctctours2020@gmail.com ద్వారా టూరిస్టులను మోసం చేస్తోంది.
ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ను పోలినట్టు ఉన్న నకిలీ వెబ్‌సైట్ గురించి ఐఆర్‌సీటీసీకి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ఐఆర్‌సీటీసీ అప్రమత్తమైంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచారం చేస్తోంది. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctour.com కాదని, ఈ వెబ్‌సైట్‌లో ఏవైనా లావాదేవీలు జరిపితే తమకు సంబంధం లేదని హెచ్చరిస్తోంది. టూరిస్టులు ఎవరైనా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో లేదా ఐఆర్‌సీటీసీ గుర్తింపు పొందిన ఏజెంట్ల దగ్గరే టికెట్లు బుక్ చేసుకోవాలి.
Where we have to book railway reservation tickets.
ReplyDelete