Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Railways: Train Journey does not bore. . . Railway to show movies on trains

Railways : ట్రైన్ జర్నీ బోర్ కొట్టదు . . . రైళ్లల్లో సినిమాలు చూపించనున్న రైల్వే
Railways: Train Journey does not bore. . . Railway to show movies on trains

సినిమాలతో పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయి . రైళ్లల్లో ఏర్పాటు చేసే మీడియా సర్వర్లలో వేర్వేరు భాషల్లో సినిమాలు , మ్యూజిక్ వీడియోలు , లైఫ్ స్టైల్ కార్యక్రమాలు ఉంటాయి .

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్... ఉచితంగా కొత్త సర్వీస్
ఇండియన్ రైల్వే ప్రయాణికులు వారి రైలు ప్రయాణ సమయంలో ఉచితంగా లేదా సబ్ స్క్రిప్షన్ ఆధారంగా కంటెంట్ ఆన్ డిమాండ్ (CoD) ద్వారా కంటెంట్‌ను వీక్షించడానికి ఈ కొత్త సర్విస్ ను ప్రకటించింది.ఈ సేవకు రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని మినిరత్నా పిఎస్‌యు, రైల్‌టెల్ నాయకత్వం వహిస్తుంది.

రైళ్లలో ఉండే ఈ కొత్త సర్విస్ లో దాదాపు మొత్తం కంటెంట్‌ను అందించడానికి జీ ఎంటర్టైన్మెంట్ అనుబంధ సంస్థ మార్గో నెట్‌వర్క్‌తో భాగస్వామ్యం చేసుకుంది.ప్రయాణీకులకు అందించబడే కంటెంట్‌లో సినిమాలు, టీవీ కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ కార్యక్రమాలు ఇంకా మరెన్నో ఉంటాయి. ఈ కంటెంట్‌లో కొన్ని ఉచితంగా అందిస్తారు కాకపోతే మరికొన్ని ఛార్జీలతో లభిస్తాయి

భారతీయ రైల్వేలోని అన్ని ప్రీమియం, ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లు, సబర్బన్ రైళ్లలో కంటెంట్ ఆన్ డిమాండ్ (CoD)సెర్వీస్ త్వరలో లభిస్తుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. యాడ్ ఆధారిత మానిటైజేషన్, సబ్ స్క్రిప్షన్ ఆధారిత మోనిటైజేషన్ ఇంకా ఇ-కామర్స్ / భాగస్వామ్య సర్వీసెస్ వంటి మూడు కొత్త స్ట్రీమ్‌ల ద్వారా ఎక్కువ ఛార్జీల భారాన్ని ప్రయాణికులపై పడనివ్వకుండా ఆదాయాన్ని సంపాదించడం దీని లక్ష్యం
చేయబడుతుందని, ఈ సర్వీసెస్ అందించే కంటెంట్ దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న ప్రేక్షకులకు అన్నీ బాషలలో అందించబడుతుంది. 2022 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని భావిస్తున్నట్లు సిఎండి, రైటెల్ పునీత్ చావ్లా చెప్పారు.

భారతీయ రైల్వేలోని మొత్తం 17 జోన్లలో మొత్తం 8731 రైళ్లు కంటెంట్ ఆన్ డిమాండ్ (CoD) సర్వీసును ఏర్పాటు చేయాలి, ఇందులో 3003 రైళ్లు పాన్ ఇండియా, 2,864 సబర్బన్ రైళ్లు ఉన్నాయి. 5563 రైల్వే స్టేషన్లకు పైగా ఉన్న అన్ని వై-ఫై ఎనేబుల్డ్ రైల్వే స్టేషన్లలో కంటెంట్ ఆన్ డిమాండ్ (CoD) అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.


రైళ్లలో మీడియా సర్వర్లు ఇంస్టాల్ చేయనున్నారు అలాగే ట్రావెల్ బుకింగ్‌లను చేయడం వంటి ఇ-కామర్స్, ఎం-కామర్స్ సేవలను కూడా కంటెంట్ ఆన్ డిమాండ్ (CoD) ప్లాట్‌ఫాం అందిస్తుంది.కంటెంట్ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతుందని అధికారిక ప్రకటనలో పేర్కొంది. వారి రైలు ప్రయాణంలో వ్యక్తిగత డివైజెస్ లో అధిక నాణ్యత(హై క్వాలిటి) గల బఫర్ ఫ్రీ స్ట్రీమింగ్‌ను అందించడానికి ఈ సర్వీస్ ప్రయత్నిస్తుంది.


ఆగస్టులో వచ్చిన ఒక నివేదికలో త్వరలో ఈ సర్వీస్ రాబోతున్నట్లు ధృవీకరించింది. రైళ్లు, రైల్వే స్టేషన్లలో సినిమాలు, ఈవెంట్లు, షోలు, మ్యూజిక్ వంటివి ప్రసారం చేసే సర్వీస్ త్వరలో ప్రారంభించబడుతుందని భారత ప్రభుత్వ రైల్వే, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Railways: Train Journey does not bore. . . Railway to show movies on trains"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0