Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NABARD Examination HALLICKETS COME .. Full details of the examination

NABARD పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయి.. పరీక్ష పూర్తి వివరాలు.
NABARD Examination HALLICKETS COME .. Full details of the examination

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD)లో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.
 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నాబార్డు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 4 వరకుహాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 
షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 4న ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రిలిమినరీ పరీక్ష ఇలా..

మొత్తం 120 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ బాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ఇలా..

➦ అభ్యర్థులు హాల్‌టికెట్ల కోసం మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. -nabard.org
➦ అక్కడ హోంపేజీలో కనిపించే 'NABARD Office Attendant Admit Card 2020'కు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి.
➦ క్లిక్ చేయగానే లాగిన్ వివరాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
➦ అభ్యర్థులు లాగిన్ పేజీలో తమ వివరాలు నమోదుచేయాలి.
➦ వివరాలు నమోదు చేయగానే అభ్యర్థుల హాల్‌టికెట్ కంప్యూటర్ తెరపై దర్శనమిస్తుంది.
➦ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని పరీక్షరోజు వెంట తీసుకురావాలి.
➦ హాల్‌టికెట్‌తో పాటు.. అభ్యర్థులు తమకు సంబంధించిన ఏదైనా ఒరిజినల్ ఫొటో గుర్తింపుకార్డును వెంట తీసుకురావాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "NABARD Examination HALLICKETS COME .. Full details of the examination"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0