Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New scheme ... profit of Rs 5,700 per month!

కొత్త స్కీమ్...నెలకు రూ.5,700 లాభం!
New scheme ... profit of Rs 5,700 per month!

ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి. వీటిల్లో అనువైన దాన్ని ఎంచుకొని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే.. అదిరిపోయే రాబడి పొందొచ్చు. 
ఈ స్కీమ్స్‌లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్స్ కూడా ఉంటాయి. అంటే వీటిల్లో డబ్బు ఇన్వె్స్ట్ చేయడం వల్ల ప్రతి నెలా చేతికి రాబడి వస్తుంది. నేషనల్ సేవింగ్స్ (మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్) స్కీమ్ కూడా ఇందులో ఒక భాగమే. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ స్కీమ్ 2019 రూల్స్‌ను నోటిఫై చేసింది. నేషనల్ సేవింగ్స్ (మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్) స్కీమ్‌లో గరిష్టంగా రూ.9 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. జాయింట్ అకౌంట్‌కు మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంటుంది. ఈ డబ్బును డిపాజిట్ చేస్తే నెలకు రూ.5,700 పొందొచ్చు. ఇలా ఐదేళ్లపాటు డబ్బులు తీసుకోవచ్చు.
మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో రూ.9 లక్షలు డిపాజిట్ చేయడం వల్ల రూ.3,42,000 లక్షల వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్ కాల పరిమితి ఐదేళ్లు. అదే సింగిల్‌గా అకౌంట్ ఓపెన్ చేస్తే గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయడానికి వీలుంటుంది. అప్పుడు మీకు నెలకు రూ.2,850 వస్తాయి.
అంటే అప్పుడు మీ డబ్బుపై మీకు రూ.1,71,000 వడ్డీ లభిస్తుంది. ఒక్కరే లేదంటే ముగ్గురు కలిసి మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ అకౌంట్‌ను పోస్టాఫీస్‌లో తెరవొచ్చు. మైనర్లకు కూడా అకౌంట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీరికి గార్డియన్ అవసరం అవుతారు.
ఒక వ్యక్తి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అకౌంట్లను ఓపెన్ చేసే సదుపాయం ఉంది. అయితే ఇక్కడ ఒక వ్యక్తి పేరుపై ఉన్న అకౌంట్లలోని మొత్తం డిపాజిట్లు డిపాజిట్ లిమిట్‌ను దాటకూడదు. నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్‌ను తెరిచేందుకు కనీసం రూ.1,000 ఉన్నా సరిపోతుంది. ఇక గరిష్ట పరిమితి రూ.4.5 లక్షలుగా ఉంది. ఒక సింగిల్ అకౌంట్‌లో రూ.4.5 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. అదే జాయింట్ అకౌంట్ అయితే రూ.9 లక్షలు డిపాజిట్ చేసే ఛాన్స్ ఉంది.
ఈ స్కీమ్‌లో డబ్బు డిపాజిట్ చేయడం వల్ల 7.6 శాతం వడ్డీ రేటు పొందొచ్చు. డిపాజిట్ చేసిన దగ్గరి నుంచి నెల రోజులకు వడ్డీ మొత్తం అకౌంట్‌లో జమవుతుంది. డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డబ్బులు తీసుకోకపోతే దానికి ఎలాంటి అదనపు వడ్డీ రాదు.
మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్‌ను ముందుగానే క్లోజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే అకౌంట్ తెరిచి ఏడాది పూర్తి అయ్యి ఉండాలి. అప్పుడు అకౌంట్‌ను క్లోజ్ చేసుకోవడం వీలవుతుంది. లేదంటే ఐదేళ్ల తర్వాత అకౌంట్‌లో డిపాజిట్ చేసిన డబ్బులను, దానిపై వచ్చిన వడ్డీ మొత్తాన్ని కలిసి వెనక్కి తీసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New scheme ... profit of Rs 5,700 per month!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0