Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Our information on the phone Safena ..?

మన సమాచారం ఫోన్ లో సేఫేనా..?
Our information on the phone Safena ..?

ఇంటర్‌నెట్‌ వినియోగం విస్తృతం అయినప్పటి నుంచి సోషల్‌ నెట్‌వర్క్‌ల యూజర్లు పెరిగారు. నెట్‌వర్క్‌ వినియోగం మంచిదే కానీ, కాలక్రమేణా అవి మనుషుల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. 
వ్యక్తిడేటాను సోషల్‌నెట్‌వర్క్‌లో పోస్ట్‌ చేసే ముందు ఆలోచించండి.
వ్యక్తిడేటాను సోషల్‌నెట్‌వర్క్‌లో పోస్ట్‌ చేసే ముందు ఒకసారి ఆలోచించి షేర్‌ చేయడం మంచిది. ఎందుకంటే ఆన్‌లైన్‌ ఉంచే వ్యక్తిగత డేటాకు భద్రత, గోప్యత తగ్గిపోతోంది. అందుకే జనవరి 28న డేటా గోప్యత దినోత్సవంగా నిర్వహించి కొన్ని దేశాల్లో అవగాహన కల్పిస్తున్నారు.
సోషల్‌మీడియాలో ఏ సమాచారాన్ని పోస్ట్‌ చేస్తున్నాం... అనేది, అవి భద్రంగా ఉంటాయా లేదా అన్న విషయం చాలామంది వినియోగదారులు తెలియకపోవచ్చు.
సరదాగా కుటుంబసభ్యులతోనో స్నేహితులతోనో దిగిన ఫొటోలను ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి వాటి ద్వారా షేర్‌ చేస్తుంటాం. కానీ, ఒకరి నుంచి ఒకరికి వెళ్లే మన సమాచారం మిస్‌యూజ్‌ అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే డేటా విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. మ
వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయకుండా సోషల్‌మీడియా గోప్యతను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుంటే అది గొప్ప ప్రయోగం అనిచెప్పొచ్చు. ఏదేమైనా డేటా గోప్యత అనేది రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి డేటా గోప్యతను పక్కన పెట్టి నెట్‌వర్క్‌లు యాప్‌లను రూపొందించడమైతే, వినియోగదారులే మరో కారణమౌతున్నారు.
ఫేస్‌బుక్కే ప్రధానం...
ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సోషల్‌ నెట్‌వర్క్‌ల్లో ఫేస్‌బుక్‌ ఒకటి. గత ఏడాదిలో ఫేస్‌బుక్‌ వినియోగం బాగా పెరిగింది. వీరిలో ఆసియా యువతే ఎక్కువట..! ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసే ప్రైవేట్‌ డేటాకు భద్రత విషయంలో వివాదాలున్నాయి. దీనిలో షేర్‌ చేసే ఫొటోలను మార్ఫింగ్‌ చేసి దుర్వినియోగపరిచే డేటా క్రిమినల్స్‌ ఎక్కువయ్యారు. మీరు పోస్ట్‌ చేసే ఫొటోలు, సమాచారానికి మీ అడ్రస్‌ కూడా జతచేయబడి ఉంటుందని మర్చిపోకూడదు. ఇది సైట్ల తప్పిదం కాకపోయినా మనమే ఆలోచన కలిగి ఉండాలి. 
 డేటా గోప్యత
డేటా గోప్యత నిర్వహించి గోప్యత గురించి దాని భద్రత గురించి అవగాహన కల్పిస్తున్నారు. అమెరికా, కెనడా, ఇజ్రాయెల్‌ వంటి 47 దేశాల్లో డేటా గోప్యత పరమైన అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. డేటా భద్రత, గోప్యతలకు భంగం కలగడం వల్ల సామాజిక మాధ్యమాల్లో వినియోగదారులకు తీవ్రమైన సమస్యలు ఎదురౌతున్నాయి. దీంతో సోషల్‌మీడియాపై ఉన్న గౌరవం దెబ్బతింటోంది. ప్రజల జీవితాలు ఆన్‌లైన్‌లో ఉంచడం ఆందోళన కలిగించే అంశం.
ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్‌ వాడకంతో పెద్ద మొత్తంలో డేటా పరిశీలించబడుతోంది. దీనిలో భాగంగా ఫొటోలు, మెడికల్‌ రికార్డులు, ఫైనాన్షియల్‌, లొకేషన్‌, బయోమెట్రిక్‌, కమ్యునికేషన్‌ వంటి వ్యక్తిగత డేటా ఎఐ పరిధిలోకి వెళ్లిపోతోంది. ఈ విధానం నుంచి డేటాకు భద్రత కల్పించడం పెద్ద చాలెంజ్‌గా మారుతోంది. సామాన్యులు సమస్యల్లో చిక్కుకుంటున్నారు. బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ డేటా గోప్యతను ఉల్లంఘించిందని ఇయూ 228 మిలియన్‌ డాలర్లు జరిమానా విధించిన సంఘటన ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. ఫొటోల్లోని బ్యాక్‌గ్రౌండ్‌ విజువల్స్‌ను బట్టి వాళ్లెక్కడున్నారో కనిపెడుతున్నారట..! పిల్లల్ని కిడ్నాప్‌ చేయడం, మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీ, సెక్స్‌ వర్కర్లుగా మార్చేందుకు కొందరు ఇలాంటి వాటిని వాడుతున్నారని తెలుస్తోంది. ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీని గోప్యత, నిఘా కోసం వాడుతున్నారు. ఒకవేళ పొరపాటున ఒకరిని గుర్తించాల్సింది పోయి మరొకర్ని గుర్తించడం వల్ల సామాన్యులకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలూ ఉంటాయి. ఇదేకాదు, గత ఏడాది ఫేస్‌యాప్‌ ద్వారా ఫొటోలను మిస్‌యూజ్‌ చేసే అవకాశముందని ఎన్నో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కొన్నిరకాల మనీలెండింగ్‌ యాప్‌ల వల్ల కూడా వ్యక్తిగత సమాచారానికి భద్రత తగ్గిపోతోందని నిపుణులు అంటున్నారు. స్మార్ట్‌ఫోన్లలో సులువుగా డౌన్‌లోడ్‌ చేసుకుని లాగిన్‌ అవడంతో సొంత ఫొటోలు, ఆధార్‌, పాన్‌కార్డు లాంటి వివరాలను ఇస్తుంటారు. ఈ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదముంది. ట్రాకర్‌ యాప్‌ల వంటివి మీ వ్యక్తిగత డేటా వారి ఆధీనంలో ఉంటుందని గమనించాలి. వీలైనంత వరకు వ్యక్తిగత సమాచారాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయకపోవడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Our information on the phone Safena ..?"

Post a comment