Postpone today's AP Cabinet. . Explanation again
నేటి ఏపీ కేబినెట్ వాయిదా . . మళ్లీ ఎప్పుడో వివరణ
హైపవర్ కమిటీ నివేదికపై మంత్రి మండలి సమావేశంలో చర్చించనున్నారు . అనంతరం అదే రోజు జరిగే అసెంబ్లీ సమావేశంలో ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణ , రాజధానుల అంశంపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశముంది .
శనివారం మధ్యాహ్నం జరగాల్సి ఉన్న ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సోమవారమే మంత్రివర్గ భేటీ జరగనుంది. వాస్తవానికి జనవరి 20నే కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. ఐతే ఆ సమావేశాన్ని శనివారానికి మార్చింది. కానీ అంతలోనే మళ్లీ వాయిదా వేసింది ఏపీ ప్రభుత్వం. షెడ్యూల్ ప్రకారం సోమవారమే ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సీఎం జగన్ శనివారం ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇక శుక్రవారం తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్‌తో హైపవర్ కమిటీ సమావేశమైంది. జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలపై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదిక సమర్పించనుంది. ఆ నివేదికపై మంత్రి మండలి సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం అదే రోజు జరిగే అసెంబ్లీ సమావేశంలో ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణ, రాజధానుల అంశంపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశముంది. ఈ సమావేశాల్లోనే బిల్లును పాస్ చేయించాలనే యోచనలో ఉంది వైసీపీ ప్రభుత్వం.
కాబినెట్ వాయిదా కి కారణాలు ఇవేనని సమాచారం.
ఏపీ సీఎం జగన్‌కు ప్రధాని , హోంమంత్రి అపాయింట్మెంట్ ఖరారైందని . . . ఈ కారణంగానే నేటి ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడిందని సమాచారం .
ఏపీలో నేడు జరగాల్సిన కేబినెట్ భేటీ మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 20న జరగాల్సిన కేబినెట్ భేటీని... నేడు జరపాలని భావించిన జగన్ సర్కార్... ఈ మేరకు ప్రకటన కూడా చేసింది. అయితే హఠాత్తుగా నేటి కేబినెట్ భేటీ వాయిదా వేస్తున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. సోమవారం రోజునే ఈ భేటీ ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే అసలు ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడటానికి కారణమేంటనే దానిపై అసక్తికరమైన చర్చ జరుగుతోంది. కీలకమైన రాజధాని తరలింపు అంశంపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవడానికి ముందుగానే ఢిల్లీలో ప్రధాని, హోంమంత్రిని కలిసి వివరించాలని ఏపీ సీఎం జగన్ భావించారనే చర్చ సాగుతోంది.
అయితే ఏపీ సీఎం జగన్‌కు వారిద్దరి అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదని... ఈ కారణంగానే ఆయన ఢిల్లీ పర్యటన వాయిదా పడుతూ వస్తోందని సమాచారం. రాబోయే రెండు రోజుల్లో ప్రధాని, హోంమంత్రి అపాయింట్‌మెంట్ ఇచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్లి వారికి రాజధాని తరలింపు అంశంపై వివరణ ఇవ్వాలని భావిస్తున్న సీఎం జగన్... ఆ తరువాతే దీనిపై కేబినెట్‌లో చర్చించి అసెంబ్లీలో పెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఈ మొత్తం ప్రక్రియకు కేంద్రం నుంచి కూడా పూర్తిస్థాయిలో సహకారం అందుతుందని ఆయన భావిస్తున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. నేడు సీఎం జగన్‌కు మోదీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ దాదాపుగా ఓకే అవుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
0 Response to "Postpone today's AP Cabinet. . Explanation again"
Post a Comment