ASER 14th Report on children who are the age between 4-8
- ఒకటో తరగతి విద్యార్థుల్లో సుమారు 60 శాతం మంది రెండు అంకెల సంఖ్యలనూ గుర్తించలేరు..
- తక్కువ వయస్సు గల పిల్లలను ప్రాధమిక తరగతిలోకి అనుమతించడం వల్ల వారు నేర్చుకోవడంలో ప్రతికూలతలు..
- ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల నిష్పత్తి ఎక్కువ..
- ప్రయివేటు పాఠశాలల్లో బాలుర నిష్పత్తి అధికం.
- ఏఎస్ఈఆర్ 14వ నివేదికలో వెల్లడి..
విద్యార్థుల సామర్ధ్యం
ఒకటో తరగతి విద్యార్థుల్లో సుమారు 60 శాతం మంది రెండు అంకెల సంఖ్యలను గుర్తించలేకపోతున్నారని వార్షిక పాఠశాల విద్యా నివేదిక ( ఎఎఆర్ ) వెల్లడించింది . ఒకటో తరగతిలో 41 . 1 శాతం మందే రెండు అంకెల సంఖ్యలను గుర్తిస్తున్నారని తెలిపింది . రెండో తరగతి విద్యార్థుల్లో 28 శాతం మంది రెండంకెలసంఖ్యలను గుర్తించలేక పోతున్నారని పేర్కొంది . నేర్చుకో వడానికి సంబంధించి తగిన ఫలితాలు రాబట్టడంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ( ఎన్‌సిఇఆర్ ) విఫలమైంది .
నివేదిక ఏంచెబుతుందంటే
ఎన్‌సిఇఆ నివేదిక ఒకటో తరగతి విద్యార్థులు 99 వరకూ గల అంకెలను గుర్తించగల సామర్థ్యం కలిగి ఉంటారని చెబుతుండటం గమనార్హం . ఎఎ ఆర్ 14వ నివేదిక ఇటీవల న్యూఢిల్లీలో విడుదల చేశారు 4-8 సంవత్సరాల మధ్య వయసు గల చిన్నారులకు ముఖ్యమైన అభివృద్ధి సూచికలను గురించి ఎఎస్ఎఆర్ - 2019 నివేదించే ప్రయత్నం చేసింది . దేశంలోని 24 రాష్ట్రాల్లోని 26 జిల్లాల్లో నిర్వహించిన సర్వే ప్రాతిపదికగా నివేదికను రూపొందించింది . మొత్తం 1,514 గ్రామాల్లోని 30,425 నివాసాల్లో 4 -8 సంవత్సరాల మధ్య వయసు గల 36,930 మంది పిల్లలు సర్వేలో పాల్గొన్నారు . పాఠశాలల్లో ,ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను నమోదు చేసుకునే సమయంలో 2009 నాటి విద్యా హక్కు చట్టం ( ఆర్టిఇ ) ని ఉల్లంఘించిన విషయాన్ని ప్రధానంగా ఈ నివేదిక వెల్లడిస్తోంది . ఆరేళ్ల వయసు చిన్నారులు పాఠశాలకు వెళ్లడాన్ని ఆ,ఇ తప్పనిసరి చేసింది . ఒకటో తరగతిలో ఉన్న ప్రతి 10 మంది విద్యార్థుల్లో నలుగురు ఐదేళ్లలోపు ఉన్నవారు గాని , ఆరేళ్లు పైబడిన వారు గాని ఉండటం విశేషం . ఇది చిన్నారుల్లో నేర్చుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తోంది . చిన్నారుల్లో ప్రారంభ భాష , ప్రారంభ సంఖ్యలు , సామాజిక , భావోద్వేగాలతో కూడిన అభ్యసన సామర్ధ్యాలపై ప్రభావం చూపుతోంది . ఉదాహరణకు ఒకటో తరగతి సమూహంలో దాదాపు 4-5 సంవత్సరాల మధ్య వయసున్న చిన్నారులు ఒకటో తరగతి స్థాయి పుస్తకాన్ని చదవగలరని నివేదిక తెలిపింది . తక్కువ వయసు గల పిల్లలను ప్రాధమిక తరగతిలోకి అనుమతించడం వల్ల వారు నేర్చుకోవడంలో ప్రతికూలతలు ఏర్పడతాయి . వీటిని అధిగమించడం వారికి కష్టమవుతుందని నివేదిక పేర్కొంది . పాఠశాలల్లో విద్యార్థులను లింగ ప్రాతిపదికన నమోదు చేసుకునే అంశాన్ని కూడా నివేదిక చర్చించింది . ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల నిష్పత్తి ఎక్కువగా ఉంటే , ప్రైవేటు పాఠశాలల్లో బాలుర నిష్పత్తి అధికంగా ఉంది . ప్రభుత్వ ప్రి - స్కూళ్లలో 56 . 8 శాతం మంది బాలికలు , 50.4 శాతం మంది బాలురు చేరితే ప్రైవేటు ప్రి - స్కూళ్లు లేదా పాఠశాలల్లో 43.2 శాతం బాలికలు , 49 .6 శాతం బాలురు నమోదయ్యారని నివేదిక పేర్కొంది .
0 Response to "ASER 14th Report on children who are the age between 4-8"
Post a Comment