Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Restrictions on ACs .. Do not reduce to 24 degrees.

ఏసీలపై ఆంక్షలు.. 24 డిగ్రీలకు తగ్గొద్దు, కేంద్రం ఆదేశాలు.

చాలా వేడిగా ఉంది, ఏసీ 18లో పెట్టు బ్రదర్'.వేసవికాలంలో ఈ మాట తరచూ వినబడుతుంది. 



మే, జూన్‌ నెలల్లో మనదేశంలో ఎయిర్ కండిషనర్లు లేకుంటే ఉండడం చాలా కష్టం. ఒకప్పుడు సంపన్నుల ఇళ్లలో మాత్రమే ఉండే ఏసీలు ఇప్పుడు సామాన్యుల ఇళ్లలోకి కూడా చేరాయి. అయితే ఏసీల ద్వారా విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏసీని 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే ఎగువన నడిపించాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చినట్టని పేర్కొంది. ఇందులో భాగంగా ఏసీలు తయారు చేసే కంపెనీలకు, ఎయిర్ కండిషనర్లలో డిఫాల్ట్ సెటింగ్ 24   
డిగ్రీల దగ్గర ఉంచాలని ఆదేశాలు .
ఈ నిబంధన అన్ని స్టార్ గుర్తులకూ వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.

విద్యుత్ మంత్రిత్వశాఖ ఏసీ డిఫాల్ట్ సెట్టింగ్ 24 డిగ్రీల సెల్సియస్ ఉంటే కరెంటు ఆదా అవుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వలన ఏడాదికి 20 బిలియన్ యూనిట్లు ఆదా చేయవచ్చని మంత్రిత్వశాఖ భావిస్తోంది. ఏసీలో ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెంచడం వల్ల 6 శాతం ఎనర్జీ ఆదా అవుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతను 18 డిగ్రీలకి బదులు 24 డిగ్రీలకు సెట్ చేయడం వలన ఎనర్జీ ఆదా అవుతుంది. గదిలో ఉష్ణోగ్రత తగ్గించి ఉంచడానికి కంప్రెసర్‌ ఎక్కువ సేపు శ్రమించాల్సి ఉంటుంది. 24 నుంచి 18 డిగ్రీలకు సెట్ చేసినంత మాత్రాన, ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు ఉండదని నిపుణులు తెలిపారు. కంపెనీలు, నివాసాల్లో ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉంచేలా జపాన్ ప్రభుత్వం 2005లోనే అక్కడి ప్రజలను ప్రోత్సహించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Restrictions on ACs .. Do not reduce to 24 degrees."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0