Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI Innovative Home Loan Scheme

ఎస్‌బీఐ వినూత్న గృహ రుణ పథకం.

ముంబై: దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. 'రెసిడెన్షియల్‌ బిల్డర్‌ ఫైనాన్స్‌ విత్‌ బయ్యర్‌ గ్యారంటీ (ఆర్‌బీబీజీ)' పేరుతో ఆరంభించిన ఈ పథకం కింద.. ఎంపిక చేసిన గృహ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి ఎస్‌బీఐ నుంచి హామీ లభిస్తుంది. అది కూడా ఎస్‌బీఐ నుంచి రుణం తీసుకుని ఆ ప్రాజెక్టుల్లో ఇల్లు కొనుగోలు చేసిన వారికే ఇది వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా 10 పట్టణాల్లో రూ.2.5 కోట్ల ధర ఉండే ప్రాజెక్టులపై ఈ పథకం ముందుగా అమలవుతుందని ఎస్‌బీఐ తెలిపింది.
ఈ పథకం కొనుగోలుదారులకు, బిల్డర్లకు, బ్యాంకుకు ప్రయోజనం చేకూరుస్తుందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.
ఈ పథకం గురించి కుమార్‌ మరింత వివరిస్తూ.. ''ఉదాహరణకు ఒక కొనుగోలుదారు ఒక ప్రాజెక్టులో రూ.2 కోట్ల ఫ్లాట్‌ బుక్‌ చేసుకుని రూ.కోటి చెల్లించారనుకుంటే, ఆ ప్రాజెక్టు నిలిచిపోతే అప్పుడు రూ.కోటి తిరిగి కొనుగోలుదారుకు చెల్లిస్తాం. ఈ గ్యారంటీ సంబంధిత ప్రాజెక్టు ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్‌ పొందేంత వరకు అమల్లో ఉంటుంది'' అని పేర్కొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI Innovative Home Loan Scheme"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0