Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Shocking news for motorists ... liter petrol price to reach one hundred ...?

వాహనదారులకు షాకింగ్ న్యూస్... వందను తాకబోతున్న లీటర్ పెట్రోల్ ధర...?

ఈ మధ్య కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలలో పెరుగుదలే తప్ప తగ్గుదల కనిపించటం లేదు. ఇరాన్ ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణితో దాడులు చేయటంతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. యుద్ధవాతావరణం నెలకొనడంతో పెట్రోల్, డీజిల్ రేట్లలో పెరుగుదల కనిపిస్తోందని తెలుస్తోంది. రోజురోజుకు పెరుగుతూ పెట్రోల్ ధరలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. గల్ఫ్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటంతో లీటర్ పెట్రోల్ 100 రూపాయలకు చేరబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో లీటర్ పెట్రోల్ ధర అటూ ఇటుగా 50 రూపాయలు ఉండేది. ఆరు సంవత్సరాల తరువాత లీటర్ 80 రూపాయలకు అటూ ఇటుగా పలుకుతున్న పెట్రోల్ ధర మరికొన్ని రోజుల్లో 100 ను తాకినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది.
ఇప్పటికే బ్రాండెడ్ పేరుతో కొన్ని పెట్రోల్ బంకుల్లో లీటర్ పెట్రోల్ 90 రూపాయలకు అమ్ముడవుతుండగా హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర 80.61 రూపాయలుగా ఉంది. ఏపీ రాజధాని అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 80.14 రూపాయలుగా ఉంది. డీజిల్ ధరలు హైదరాబాద్, అమరావతిలో 75.17 రూపాయలు, 74.34 రూపాయలుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వలనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.

పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే పెట్రోల్, డీజిల్, ధరలతో పాటు ఎల్పీజీ గ్యాస్ ధర కూడా పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగితే సామాన్యులపై భారీగా భారం పెరిగే అవకాశం ఉంది. మోదీ హయాంలోనే పెట్రోల్ ధర మూడంకెలను చేరనుందని అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు రూపాయి విలువ కూడా దిగజారే పరిస్థితులు కనిపిస్తున్నాయని సమాచారం. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే మాత్రం సామాన్యులకు కొత్త కష్టాలు మొదలైనట్లే అని చెప్పవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Shocking news for motorists ... liter petrol price to reach one hundred ...?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0