Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Shock to AP people. . Increase electricity charges. . ?

ఏపీ ప్రజలకు షాక్ . . విద్యుత్తు ఛార్జీల పెంపు . . ?
Shock to AP people. . Increase electricity charges. . ?

ఏపీలో విద్యుత్తు ఛార్జీలు పెరగనున్నాయా ? ప్రజలకు కరెంట్ షాక్ కొట్టనుందా ? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి . 

విద్యుత్తు ఛార్జీల పెంపు కోసం ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది .
ఏపీలో విద్యుత్తు ఛార్జీలు పెరగనున్నాయా? ప్రజలకు కరెంట్ షాక్ కొట్టనుందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. విద్యుత్తు ఛార్జీల పెంపు కోసం ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2020-21లో కరెంట్ ఛార్జీల పెంపు ప్రతిపాదనపై రేపటి నుంచి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు ఏపీ దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) సీఎండీ హెచ్‌ హరనాథరావు తెలిపారు. 9న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలో, 10న కడప జిల్లా పరిషత్‌ హాల్‌లో, 11న తిరుపతి ఎస్పీడీసీఎల్‌ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని ఆయన వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చాక నిర్ణయించాల్సిన ధరలు కావడంతో ఏపీ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.44,840.86కోట్లు అవసరమవుతాయని వార్షిక ఆదాయ అవసర నివేదిక (ఏఆర్‌ఆర్‌)లో డిస్కంలు పేర్కొన్నాయి. ఆర్థిక పరిస్థితి, 2020-21లో సమకూర్చుకోగలిగే రాబడి, నిర్వహణకు అయ్యే వ్యయం, ఏర్పడే లోటు తదితర అంశాలను డిస్కంలు ఏఆర్‌ఆర్‌లో పొందుపరిచాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Shock to AP people. . Increase electricity charges. . ?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0