Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Tax Time

మీరు నిజంగా మీ టాక్స్ అమౌంట్ ను సేవ్ చేస్తున్నారా ? మీ టాక్స్ స్లాట్లను తెలుసుకోండి అలానే మీ పెట్టుబడి ప్రణాళికలను ఇప్పుడే ఒకసారి సరి చూడండి !

కొత్త సంవత్సరం వచ్చేసింది . ప్రతి ఏడాది చేస్తూ వస్తున్న పని ఈసారి కూడా చేయాల్సిందే . భారత్ లో జనవరి నుంచే ట్యాక్స్ ఫైలింగ్ తతంగం మొదలవుతుంది . మార్చి - నెల చివరి వరకు ఇన్వెస్ట్మెంట్ల ప్రక్రియ కొనసాగుతోంది . చాలా మంది ఇప్పటి నుంచి ట్యాక్స్ సేవింగ్ సాధనాల వైపు చూడటం ప్రారంభిస్తారు .
భారత్ లో దేశ జనాభాతో పోలిస్తే పన్ను చెల్లింపుదారులు తక్కువగా ఉన్నా కూడా వారు చెల్లించే పన్ను మొత్తం ఎక్కువగానే ఉంది . 2018 - 19లో ఇన్కమ్ ట్యా క్స్ కలెక్షన్లు రూ . 4,42,170 కోట్లుగా నమోదయ్యాయి . ఇది చిన్న మొత్తం ఏమీ కాదు . అందుకే ఇక్కడ పన్ను - చెల్లింపుదారులు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి . ట్యాక్స్ స్లాబు అనుగుణంగా తమ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయా ? లేదా ? అనే విషయాన్ని గుర్తించాలి
ట్యాక్స్ ఇన్వెస్టమెంట్ సాధనాల్లా పెట్టుబడి పెట్టడం వల్ల కచ్చితంగా పన్ను ఆదా చేసుకోవచ్చు . అయితే దీనికి కొంత ప్లానింగ్ ఉండాలి . బేసిక్ ఇన్ కమ్ ట్యాక్స్ స్లాబ్స్ గురించి తెలిసుండాలి . మీరు 20% ట్యా క్స్ బ్రాకెట్లో ఉంటే సులభంగానే పన్ను ఆదా చేసుకోవచ్చు . దీనికి చాలా • ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి .  అదే మీరు 30 % ట్యా క్స్ స్లాబ్ లో ఉంటే పన్ను ఆదా చేసుకోవడం సవాల్ లో కూడుకున్న వ్యవహారమే . 
ట్యా క్స్ స్లాబ్స్ ఇలా
రూ . 5,00,000 వరకు పన్ను ఆదాయం కలిగినవారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి . వీరికి ట్యా క్స్ రిబేట్ ఉంటుంది . ఎలాంటి పన్ను పడదు . గత బడ్జెట్ లో ఈ బెనిఫిట్ ప్రకటించబడింది .
ఇప్పుడు ట్యాక్స్ స్లాట్స్ పై ఒక అవగాహన వచ్చే ఉంటుంది . ఇప్పుడు చేయాల్సిన పని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి ఆలోచించాలి . మీ లైఫ్ స్టైల్ కు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్లను ప్లాన్ చేసుకోవాలి . మీరు ఒక్కరిగా ఉంటే ఒక విధంగా , పెళ్లి చేసుకొన్ని ఆ ఉంటే మరోలా పెట్టుబడి ప్రణాళికలు " మారతాయి . అవసరాలు ప్రాతిపదికన ఇన్వెస్ట్మెంట్లు కూడా మారాలి . హోమ్ లోన్ ఈఎంఐ నుంచి పిల్లల ట్యూషన్ ఫీజు వరకు పలు అంశాలపై పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ఉన్నాయి.
సింగిల్స్ కోసం . . 
మీరు సింగల్ గా ఉన్నప్పుడు , మీకు ప్రపంచ పర్యటనలు చెయ్యాలని ఉన్నా లేదంటే మీ గురించి తెలిసేలా ఏదైనా చెయ్యాలి అని అ అనుకుంటున్నప్పుడు , " పెట్టుబడి < పెట్టడం " అనేది మీకు సరైన ఎంపిక కాకపోవచ్చు . అయితే , మీరు ఒకసారి దీని గురించి ఆలోచిస్తే , మీ భవిష్యత్ ప్రయాణాలకు ఉపయోగపడే కొన్ని పెట్టుబడులను పెట్టడానికి ఇది మీకు మంచి సమయంలా ఉంటుంది . మీకు ఇప్పటికే ఎడ్యుకేషన్ లోన్ ఉంటే . . అప్పుడు కచ్చితంగా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాల్సిందే . ఇన్ కమ్ ట్యా క్స్ చట్టంలోని సెక్షన్ 80E కింద ఎడ్యుకేషన్ లోన్ పై చెల్లించే వడ్డీ మొత్తంపై కూడా పన్ను 19 ప్రయోజనాలు పొందొచ్చు . దీనికి , అదనంగా యులిప్ ( యూనిట్ లింక్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ) ఎంచుకుంటే . . అప్పుడు మరిన్ని బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు . యులిప్  కాకుండా ఇలాంటి వాటిలో కలిగే ఇబ్బందులు ఈ ప్లాన్ లో ఉండవు . హెచ్ డీఎఫ్ సీ లైఫ్ క్లిక్ 2 వెల్త్ ప్లాన్ వల్ల లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు మెచ్యూరిటీ సమయంలో మంచి రాబడి పొందడం ద్వారా ఇన్వెస్ట్మెంట్లకు రక్షణ కూడా లభిస్తుంది .
ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ తో ఇన్ కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 80C కింద రూ . 1 . 5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు . దీనికి అదనంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం వల్ల సెక్షన్ 80D కింద రూ . 25 , 000 వరకు తగ్గింపు క్లెయిమ్ చేసుకోవచ్చు . మీరు చిన్న వయసులోనే లైఫ్ ఇన్సూరెన్స్ ని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ తీసుకుంటే ఈ ప్రీమియం తక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి .
 పెళ్లి అయిన వారికి . .
మీకు ఇప్పటికే పెళ్లి అయిపోయి ఉంటే , పిల్లల కోసం ప్లాన్ చేస్తూ ఉంటే , లేదంటే ఇప్పటికే పిల్లలు ఉంటే . . మీ ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలపై వీటి ప్రభావం ఉంటుంది . హోమ్ లోన్స్ , పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల రూ . 20000 , రూ . 88000 లేదా 2 మొత్తంగా రూ . 1,00,000 వరకు - ఆదా చేసుకోవచ్చు . మీ ట్యాక్స్ స్లాబ్స్ ప్రాతిపదికన ఆదా అయ్యే మొత్తం ఆధారపడి ఉంటుంది .
ఇక్కడ ఇన్సూరెన్స్ ప్లాన్ల విషయానికి వస్తే . . హెచ్ డీఎఫ్ సీ లైఫ్ క్లిక్ 2 ప్రొటెక్ట్ 3డీ ప్లస్ ప్లాన్ గురించి మాట్లాడుకోవాలి . ఇది ఆన్లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ . ఈ పాలసీ తీసుకోవడం వల్ల అనుకోని పరిస్థితుల్లో మరణించినా లేదంటే అంగవైకల్యం , తీవ్ర అనారోగ్యం 9 వంటివి సంభవించినప్పుడు ఈ పాలసీ కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉంటుంది . 2018 - 19లో ఈ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99 . 03 శాతంగా ఉంది .  ప్రీమియం మధ్యలోనే రద్దు చేసుకున్నప్పటికీ కలిగే బెనిఫిట్ , టాక్స్ చట్టాలలో పేర్కొన్న వివిధ టాక్స్ బెనిఫిట్స్ వంటి పలు ప్రయోజనాలు కూడా పొందొచ్చు .ఇప్పటికీ కూడా మీరు ఇంకా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే అప్పుడు నేషనల్ పెన్షన్ స్కీమ్ ( ఎన్‌పీఎస్ ) లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు . ఎన్‌పీఎస్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల సెక్షన్ 80CCD ( 1B ) కింద అదనంగా రూ . 50,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు . రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసే వారు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు . 
రిటైర్మెంట్ కు దగ్గరిలో ఉన్నారా ?
మీరు పదవీ విరమణ దగ్గరకు వచ్చేశారా ? హోమ్ లోన్ ఈఎంఐలు చివరి దశకు చేరుకొని ఉంటాయి . లేదంటే పూర్తిగా చెల్లించేసి ఉంటారు . స్టాక్స్ , మ్యూచువల్ ఫండ్స్ , చిన్న వ్యాపారం ఇలా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను కలిగి ఉండొచ్చు . అయితే వీరికి ట్యా క్స్ సేవింగ్ 9 ఆప్షన్లు మాత్రం చాలా తక్కువగా - ఉన్నాయి . ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ పెంచుకోవడానికి ఇదే సరైన సమయం . అలాగే వాలంటరీ ఈపీఎఫ్ ఫండ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వండి.ఈపీఎఫ్ స్కీమ్ , హోమ్ లోన్ - పేమెంట్స్ , లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం వంటి వాటిల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల సెక్షన్ 80C కింద పూర్తి బెనిఫిట్సను పొందొచ్చు . దీనికి అదనంగా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ ఫోలియోను , ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ ఉండాలి . అలాగే గ్యారంటీ సేవింగ్స్ ప్లాన్ లో డబ్బులు దాచుకుంటూ రావాలి . కచ్చితమైన రాబడి అందించే ప్లాన్లలో హెచ్ డీఎఫ్ సీ లైఫ్ సంచాయ్ ప్లస్ ప్లాన్ కూడా ఒకటి . (99 ఏళ్ల వరకు కచ్చితమైన రాబడి ) కూడా అందిస్తోంది . ఈ ప్లాన్ , ప్రీమియం చెల్లింపు పీరియడ్ అయిపోయిన తర్వాత ప్రీమియం యొక్క రాబడిని కూడా అందిస్తుంది . సెక్షన్ 80D ప్రకారం ₹ 50,000 వరకు అన్ని తగ్గింపులను పొందటానికి మీ యొక్క మరియు మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య బీమా పథకాలను ఈ తిరిగి సరి చూడడానికి ఇదే సరైన సమయం .
సీనియర్ సిటిజన్ల కు ఇలా . .
రిటైర్మెంట్ తర్వాత లేదా సీనియర్ సిటిజనకు ప్రత్యేక బెనిఫిట్స్ లభిస్తున్నాయి.వీరికి రూ . 5,00,000 వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు . ట్యాక్స్ సేవింగ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మరింత డబ్బును ఆదా చేసుకోవచ్చు . సీనియర్ సిటిజన్స్ 9 బాధ్యతలు భారం దించేసుకుంటార - ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ , నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ , ఈఎస్ఎస్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు .దీనికి అదనంగా పదవీ విరమణ చేసిన వారు , జీవింతాంతం కచ్చితంగా రెగ్యులర్ ఆదాయం అందించే హెచ్ డీఎఫ్ సీ లైఫ్ పెన్షన్ గ్యారంటీడ్ ప్లాన్ వంటి యాన్యుటీ ప్లాన్స్ కొనుగోలు చేయడం వల్ల రెగ్యులర్ ఆదాయం పొందొచ్చు . మీరు సింగిల్ లేదా జాయింట్ లైఫ్ ప్లాన్ తీసుకోవచ్చు మరియు ప్లాలో చేరడం వల్ల వెంటనే లేదా కొంత కాలం తర్వాత డబ్బులు పొందొచ్చు .మీరు ఏ వయసులో ఉన్నా కూడా ఆర్థిక ప్రణాళికలను మాత్రం అనుసరించండి . అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉండాలి . మీరు కొత్తగా ఉద్యోగంలోకి చేరినా , పదవీ విరమణ చేసినా ఇప్పుడు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ ఫోలియోను రిచెక్ చేసుకోండి . · నిజంగానే పన్ను ఆదా ప్రయోజనాలు పొందుతున్నామా ? అని ప్రశ్నించుకోండి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Tax Time"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0