The basis for everything .. U-Dies
- అన్నింటికీ ఆధారం.. యూ-డైస్..
- యూ-డైస్ వివరాలు పొరపాట్లు లేకుండా వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలి..
- నెల రోజులు పాటు వివిధ దశల్లో ప్రక్రియ పూర్తి..
- ఎంఈవో లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లుకు శిక్షణతో ప్రక్రియ ప్రారంభం..
పాఠశాల అభివృద్ధికి సమగ్ర దర్శిని , ఏ అంశానికైనా వాఅదే ప్రామాణికం . ఏ తరహా నిర్ణయం తీసుకోవా లన్నా ఆ సమాచారమే ఆధారం . అందుకే యుని పైడి డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ( యూ - డైస్ ) అన్ని టికీ ఆధారంగా భావిస్తారు . ఇందులో ఏవిధ మైన పొరపాట్లు చేసినా ఆయా పాఠశాలలకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటికి కచ్చితంగా బాధ్యులు అన్యాయం చేసినట్లే . అందుకే యూ - డైస్ వివరాలు కచ్చితంగా నమోదు చేయాల్సిన అవసరం ఉంది . నెలరోజుల పాటు వివిధ దశల్లో ప్రక్రియలు పూర్తి చేసి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ విభాగా నికి ( ఎమ్ హెమోడీ ) వివరాలు అందివ్వాల్సి ఉంటుంది . ఇందుకు సంబంధించిన తొలి ఘట్టం శనివారం ఎంఈఓలు , ఎంఐఎస్ కోఆ ర్డినేటర్లు , డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణతో ప్రక్రియ ప్రారంభమవుతుంది .
కేంద్రీయ పాఠశాలలు తప్పని సరి
ఈ సంవత్సరం కేంద్రీయ విద్యాల యాల విద్యార్థులు చైల్డ్ ఇన్ఫోలో లేక పోవడంతో అమ్మఒడికి ప్రతిబంధకం ఏర్పడింది . యూడైస్ నంబరు లేక పోవడంతో సమస్య తలెత్తింది . ఈ నేపథ్యంలో తప్పని సరిగా నమోదు చేయాల్సిందే . జిల్లాలోని నవోదయ , రైల్వే స్కూళ్లు , కేంద్రీయ విద్యాలయాలు - భాగస్వామ్యం కావాలి .
యూ - డైస్ ప్లస్ ఇలా
యూ - డైసను తాజాగా యూ - డైస్ ప్లస్ గా మార్పు చేశారు . ఉన్న మొత్తం 72 సూచికలతో పాటు ఈ సంవత్సరం అదనంగా 8 సూచికలు నమోదు చేయాల్సి ఉంటుంది . పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండికేటర్స్ రేటింగ్ ( పీజీఐ ) ని బట్టి ఆయా పాఠశాలలకు నిధులు కేటా యిస్తారు . నిధులు రావాలన్నా , తగ్గా లన్నా పీజీఐ కీలకం కానుంది . పాఠశాల అభివృద్ధికి రేటింగ్ ప్రధాన భూమిక వహి స్తుంది . ఈ విద్యా సంవత్సరంలోనే విద్యా ర్థుల సంఖ్యను బట్టి జిల్లాకు పాఠశాల నిర్వ హణ నిధులను రూ . 7 . 82 కోట్లు కేటాయిం చారు . అన్ని అంశాలను సమగ్రంగా నమోదు చేయించడంలో సంబంధిత ప్రధానోపాధ్యా యులు చొరవ చూపాల్సి ఉంటుంది . ఈ సంవ త్సరం ఎక్కడైతే పాఠశాలల్లో అంగన్‌వాడీ పాఠశాలలు అనుబంధంగా ఉంటాయో ఆ విద్యార్థుల వివరాలను నమోదు చేయాలి .
ఒక్కో విద్యార్థికి రూ . 2
యూడైస్ ఆరంభం నుంచి పూర్తయ్యే వరకు రాష్ట్ర జిల్లా , మండల , పాఠశాల స్థాయి వరకు నిధులు ఇస్తారు . మొత్తంగా ఒక్కో విద్యార్ధికి రూ . రెండు చెల్లిస్తారు . జిల్లాలో విద్యార్థుల వివరాలను నమోదు చేయడానికి రూ . 11 70 లక్షలు కేటాయించారు . ప్రభుత్వ , ప్రైవేటు అన్ని యాజమాన్యాల్లోని వారు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది . అయితే సంబంధిత యూడైస్ పత్రాన్ని మండల విద్యాశాఖాధికారి ద్వారా పొందాల్సి ఉంటుంది . కచ్చితంగా పాఠశాల ప్రతినిధి భాగస్వా మ్యమై డేటాను సీఆర్‌పీ , డేటా ఆపరేటర్ ద్వారా ఆన్లై లో పొందుపరిస్తేనే వివరాలు సక్రమంగా ఉంటాయి .
0 Response to "The basis for everything .. U-Dies"
Post a Comment