Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The central government has given good news to the employees. Increased the minimum wage limit. However, this does not apply to everyone.

మోదీ గుడ్ న్యూస్...ఉద్యోగులకు వేతన పరిమితి రెట్టింపు.
The central government has given good news to the employees. Increased the minimum wage limit. However, this does not apply to everyone.

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కనీస వేతన లిమిట్‌ను పెంచింది. అయితే ఇది అందరికీ వర్తించదు. 
ఎంప్లాయీస్ కంపెన్సేషన్ యాక్ట్ 1923 కింద వర్కర్ల కంపెన్సేషన్ లెక్కింనకు కనీస వేతన పరిమితిని పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మోదీ సర్కార్ జనవరి 3న ఈ కొత్త రూల్‌ను నోటిఫై చేసింది. కంపెన్సేషన్ లెక్కింపునకు ఇది వరకు రూ.8,000 వేతనాన్ని ప్రామాణికంగా తీసుకునేవారు. అయితే కొత్త రూల్స్ ప్రకారం ఇకపై కంపెన్సేషన్ లెక్కింపునకు రూ.15,000 వేతనాన్ని ఆధారంగా తీసుకుంటారు. కార్మిక శాఖ తాజా నోటిఫికేషన్‌లో ఈ విషయం వెల్లడైంది. ఎంప్లాయీస్ కంపెన్సేషన్ యాక్ట్ 1923ను 2010 ముందు వరకు వర్క్‌మెన్ కంపెన్సేషన్ యాక్ట్‌గా చెప్పుకునేవారు.
డ్యూటీలో ఉన్నప్పుడు ఉద్యోగి మరణించడం లేదా పాక్షిక/శాశ్వత అంగవైకల్యం సంభవించడం వంటివి జరిగితే.. అప్పుడు ఈ యాక్ట్ కింద పరిహారాన్ని లెక్కించేవారు. తదనుగుణంగా వచ్చిన మొత్తాన్ని సదురు ఉద్యోగి లేదా ఉద్యోగి కుటుంబానికి అందజేసేవారు. ఇక్కడ పరిహారం మొత్తం పొందేందుకు ఉద్యోగి నేరుగా అప్లై చేసుకునే వెసులుబాటు అప్పట్లో ఉండేది కాదు.

అంటే కంపెనీయే ఉద్యోగికి పరిహారం చెల్లించాలి. ఈఎస్‌ఐసీ కింద పరిహారం పొందిన వారికే ఈ రూల్ వర్తించేది. ఏదేమైనా కంపెనీయే ఉద్యోగికి పరిహారం చెల్లించేది. ఇకపోతే ఉద్యోగికి కంపెనీ పరిహారం చెల్లింపు కొన్ని సందర్భాల్లో చెల్లుబాటు అయ్యేది కాదు.

ఉద్యోగికి ప్రమాదం జరిగి మూడు రోజులు దాటితే అప్పుడు పరిహారం కోసం అప్లై చేసుకోవడం కుదరదు. అంటే మూడు రోజుల్లోనే పరిహారం కోసం అప్లై చేసుకోవాలి. అలాగే మందు తాగడం, డ్రగ్స్ తీసుకోవడం వల్ల ప్రమాదం జరిగితే ఎలాంటి పరిహారం రాదు. అలాగే సేఫ్టీ నిబంధనలను అతిక్రమించడం వల్ల గాయాలు లేదా ప్రమాదం జరిగితే అప్పుడు కూడా పరిహారం తిరస్కరణకు గురికావొచ్చు.

కంపెన్సేషన్ యాక్ట్‌లోని సెక్షన్ 4 ప్రకారం పరిహారం లెక్కింపు జరుగుతుంది. ప్రమాదంలో ఉద్యోగి మరణిస్తే.. అప్పుడు రూ.1.20,000 పరిహారం కుటుంబానికి అందజేస్తారు. ఒకవేళ ప్రమాదం వల్ల అంగవైకల్యం సంభవిస్తే..

అలాంటప్పుడు అప్పడు నెలవారీ వేతనంలో 60 శాతానికి సమానమైన మొత్తాన్ని ఇస్తారు. లేదంటే రూ.1.2 లక్షలు ఇస్తారు. రెండింటిలో ఏది ఎక్కువైతే అది అందజేస్తారు. ఇకపై పరిహారం లెక్కింపులో రూ.15,000 కనీస వేతనాన్ని పరిగణలోకి తీసుకుంటారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The central government has given good news to the employees. Increased the minimum wage limit. However, this does not apply to everyone."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0