Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

auto Sweep: If you know this technique. . . Double interest into your bank account

Auto Sweep : ఈ టెక్నిక్ తెలిస్తే . . . మీ బ్యాంక్ అకౌంట్ లోకి డబుల్ వడ్డీ.
auto Sweep: If you know this technique. . . Double interest into your bank account


  • మీరెప్పుడైనా ఆటో స్వీప్ గురించి విన్నారా ? చాలావరకు బ్యాంకులు ఈ విధానం గురించి కస్టమర్లకు చెప్పవు . ఆటో స్వీప్ సేవింగ్స్ ఖాతాలో ఉండే సదుపాయం . చాలామందికి దీని గురించి తెలియదు . మీరు ఈ ఆప్షన్ ఎంచుకుంటే ఎక్కువ వడ్డీ పొందొచ్చు .
  • మీ సేవింగ్స్ అకౌంట్లో ఉండే డబ్బుకు బ్యాంకులు 3 నుంచి 4 శాతం వరకు వడ్డీ మాత్రమే ఇస్తాయి . కానీ . . . సేవింగ్స్ అకౌంట్లో డబ్బులపై మీకు ఇంకా ఎక్కువ వడ్డీ ఇచ్చేందుకు ఉపయోగపడేదే ఆటో స్వీప్ ఫెసిలిటీ
  •  .మనం ఆటో స్వీప్ విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకొని వాడుకుంటే మీకు ఎక్కువ వడ్డీ లభిస్తుంది . సాధారణంగా వచ్చే వడ్డీ కన్నా రెట్టింపు వడ్డీ | పొందొచ్చు . మరి ఆటో స్వీప్ అంటే ఏంటీ ? దాని వల్ల లాభమేంటీ ? నష్టాలు ఏమైనా ఉన్నాయా ? తెలుసుకుందాం.
  • మీ సేవింగ్స్ అకౌంట్ లో మీ అవసరానికి మించి ఉన్న డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ లోకి మళ్లించి ఎక్కువ వడ్డీ పొందేందుకు ఉపయోగపడేదే ఆటో స్వీప్ సదుపాయం . అంటే మీకు ఇప్పట్లో అవసరం లేదనుకున్న డబ్బును ఆటో స్వీప్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్లోకి పంపొచ్చు . 
  • ఉదాహరణకు మీ సేవింగ్స్ అకౌంట్‌లో రూ . 1 లక్ష ఉన్నాయనుకోండి , అందులో మీరు రూ . 25 ,000 మాత్రమే వాడుకోవాలనుకుంటే మిగతా రూ . 75 ,000 ఆటో స్వీప్ ఫెసిలిటీ ద్వా రా ఫిక్స్ డిపాజిట్లోకి మళ్లించొచ్చు .
  • అప్పుడు మీ అకౌంట్ రూ .  25 ,000 మాత్రమే ఉంటాయి . ఫిక్స్ డిపాజిట్లోకి వెళ్లిన రూ . 75 , 000 డబ్బుపై మీకు ఎక్కువ వడ్డీ లభిస్తుంది . ఇలా మీరు రూ . 25 , 000 నుంచి రూ . 1 లక్ష వరకు ఫిక్స్డ్ డిపాజిట్ లోకి మళ్లించొచ్చు . అయితే మీకు డబ్బులు అవసరమైతే వెంటనే డ్రా చేసుకోవచ్చు కూడా
  • సేవింగ్స్ అకౌంట్ లో చాలాకాలంగా ఎక్కువ డబ్బులు ఉన్నవారికి , ఇప్పట్లో ఆ డబ్బుతో అవసరం లేదనుకునేవారికి మాత్రమే ఆటో స్వీప్ ఉపయోగపడుతుంది . అంటే కొన్ని నెలల పాటు కొంత మొత్తం అవసరం లేదనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లోకి మళ్లించొచ్చు 
  • ఆటో స్వీప్ ఫెసిలిటీ ఉంది కదా అని పదేపదే ఫిక్స్ డిపాజిట్లోంచి డబ్బులు డ్రా చేస్తే మీకు ఎక్కువగా వడ్డీ ఏమీ రాదు . ఎందుకంటే వడ్డీని ఏడాదికి లెక్కిస్తారు . మీరు 40 రోజులకో 50 రోజులకో డబ్బులు డ్రా చేస్తే వడ్డీ అన్ని రోజులకే లెక్కిస్తారు . దీంతో మీకు పెద్దగా ఉపయోగమేమీ ఉండదు . 
  • కనీసం 30 రోజులు అయినా మీ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచాలన్న నిబంధనలు కొన్ని బ్యాంకుల్లో ఉన్నాయి . మీరు అంతలోపు డ్రా చేస్తే ప్రీమెచ్యూర్ విత్ డ్రాయల్ పెనాల్టీ కూడా చెల్లించాల్సి వస్తుంది .
  • ఆటో స్వీప్ రెండు రకాలుగా ఉంటుంది . అందులో ఒకటి Last In First Out(Lifo ) అంటే దీర్ఘకాలం ఎడ్జిలో డబ్బులు జమ చేసేవారికి ఉపయోగపడే పద్ధతి ఇది . వారికి ఎక్కువ వడ్డీ లభిస్తుంది . 
  • ఒకవేళ మీరు తరచూ డబ్బులు తీస్తూ ఉంటే First In First Out ( Fifo ) ఎంచుకోవాలి . అందుకే ఆటో స్వీప్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఈ ఫెసిలిటీ ఎంచుకోవడం మంచిది . మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే ఆటో స్వీప్ ద్వారా గరిష్టంగా 8 % వరకు వడ్డీ పొందొచ్చు . 
  • మీకు సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లి ఆటో స్వీప్ ఫెసిలిటీ గురించి తెలుసుకోవచ్చు . లేదా బ్యాంకు వెబ్సైట్లో ఆటో స్వీప్ ఫెసిలిటీకి సంబంధించిన వివరాలు ఉంటాయి . స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి ప్రభుత్వ బ్యాంకులతో పాటు యాక్సిస్ బ్యాంక్ లాంటి ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈ సదుపాయాన్ని కస్టమర్లకు అందిస్తున్నాయి . 
గమనిక: మన డబ్బులు రెట్టింపు అనగా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు రెట్టింపుకు మార్గం అంటే గాని దీనిగుండా ఏమన్నా సాధిస్తామని కాదు నా ఉద్దేశ్యం బ్యాంక్ లో మనకు చాలా మ0దికి తెలియని విషయాన్ని తెలియజేయటమే ముఖ్య ఉద్దేశ్యం అదే మనం ఇప్పటివరకు తెలుసుకున్న Auto Sweep 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "auto Sweep: If you know this technique. . . Double interest into your bank account"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0