Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The good news for employees is that you know how to tax.

ఉద్యోగస్తులకు శుభవార్త మీరు ఎంత టాక్స్ కట్టలో తెలుసుకొనే విధానం. 
The good news for employees is that you know how to tax.

ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీకు ఇప్పటికే నేను ఎంత ట్యాక్స్ కట్టాలి? అనే ప్రశ్న తలెత్తి ఉంటుంది. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే పర్వాలేదు.. లేదంటే మరేం ఇబ్బంది లేదు. ఇప్పుడు చాలా సింపుల్‌గా మీకు సమాధానం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ట్యాక్స్ లెక్కింపునకు కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆదాయపు పన్ను శాఖ కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్‌ను ఆవిష్కరించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన ఒక ఇంటరాక్టివ్ సెషన్‌లో రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషన్ ఈ కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ ఫెసిలిటీ గురించి తెలియజేశారు.
కొత్త ఇన్‌కమ్ ట్యా్క్స్ క్యాలిక్యులేటర్ వల్ల ఎవ్వరి సాయం లేకుండానే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయొచ్చని వివరించారు. సాధారణంగా చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి చార్టర్డ్ అకౌంట్స్ లేదా ఇతర ప్రొఫెషనల్స్‌కు కొంత డబ్బు చెల్లిస్తూ ఉంటారు. మోదీ సర్కార్ కొత్త సదుపాయంతో ఇకపై వారికి ఫీజుకు చెల్లించుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేసేందుకు సీఏలు, ట్యాక్స్ అధికారుల వద్దకు వెళ్లా్ల్సిన అవసరం లేకుండా ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చామని అజయ్ భూషన్ పాండే తెలిపారు.
కొత్త ఫెసిలిటీ ద్వారా పాత స్లాబ్ మంచిదా? లేదంటే కొత్త స్లాబ్ బెటరా? అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వపు కొత్త క్యాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం..
కొత్త క్యాలిక్యులేటర్ పనిచేసే విధానం
1. ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
2. తర్వాత ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లో ఇంపార్టెంట్ లింక్స్ ఉంటాయి.
వీటిల్లో ట్యాక్స్ క్యాలిక్యులేటర్ లింక్‌పై క్లిక్ చేయాలి.
3. ఇప్పుడు మీ పేరు, వయసు, ఆదాయం, పన్ను మినహాయింపులు వంటి వివరాలు ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి.
 4. ఇప్పుడు మీరు చెల్లించాల్సిన పన్ను ఎంతో వస్తుంది. కొత్త స్లాబ్‌లో ఎంత పన్ను పడుతుంది.. పాత స్లాబ్‌లో ఎంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందనే సమాచారం మీకు కనిపిస్తుంది. https://www.incometaxindiaefiling.gov.in/Tax_Calculator/index.html ఈ లింక్‌పై క్లిక్ చేసి డైరెక్ట్‌గా మీరు ఎంత పన్ను చెల్లించాలో తెలుసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The good news for employees is that you know how to tax."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0