Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Business Ideas: Worried about not having a job? . However, the center will offer Rs. 25 lakhs. . . Like life changing. . .

Business Ideas : ఉద్యోగం లేదని బాధపడుతున్నారా . . అయితే కేంద్రం ఇచ్చే రూ . 25 లక్షలతో . . . జీవితం మార్చుకోండిలా . . .
Business Ideas: Worried about not having a job? . However, the center will offer Rs. 25 lakhs. . . Like life changing. . .

కేపీఐసీ జాతీయ స్థాయిలో నోడల్ ఏజెన్సీ , రాష్ట్ర పరిధిలో ఈ పథకాన్ని కేపీఐసీ బోర్డులు , డీఐసీలు , జాతీయ బ్యాంకులు అమలుచేస్తున్నాయి . ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది .

PMEGP: ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం(పీఎంఈజీపీ) నిరుద్యోగ యువతకు ఒక వరమనే చెప్పాలి. గతంలో కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి రోజ్‌గార్‌ యోజన, గ్రామీణ ఉపాధి కల్పన పథకాలను రెండింటిని కలిపి PMEGP (Prime Minister’s Employment Generation Programme) ఏర్పాటు చేశారు. ఇందులో గ్రామీణ పట్టణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకాన్ని ఎంఎన్‌ఎంఈ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఖాధీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ ద్వారా అమలవుతోంది. కేపీఐసీ జాతీయ స్థాయిలో నోడల్‌ ఏజెన్సీ, రాష్ట్ర పరిధిలో ఈ పథకాన్ని కేపీఐసీ బోర్డులు, డీఐసీలు, జాతీయ బ్యాంకులు అమలుచేస్తున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని అర్హులకు స్వయం ఉపాధి కల్పించడం, కొత్త ప్రాజెక్టులు, కుటీర పరిశ్రమలకు అవకాశం కల్పించడం, వివిధ వృత్తుల్లో నిపుణులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, సాంప్రదాయ వృత్తుల్లో ఉన్న వారికి వృత్తి నిపుణులకు నిరంతర ఉపాధి అవకాశాలను కల్పిస్తూ వారిని పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లకుండా నియంత్రించడం, ఔత్సాహికులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చచడం ఈ పథకం ఉద్దేశ్యం. ఈ పథకం ద్వారా పాత యూనిట్ల విస్తరణ లేదా మోడరనైజేషన్ కార్యక్రమాలు, నెగిటివ్‌ పరిశ్రమల జాబితాల్లో ఉన్న వాటికి ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం లభించదు. అయితే కొత్తగా ఉత్పత్తి చేసే పరిశ్రమలకు సహాయం అందుతుంది. పరిశ్రమ ప్రాజెక్టులకు గరిష్ఠ పరిమితి వ్యక్తులకు సంస్థలకు రూ. 25 లక్షలు, ఉత్పత్తేతర సర్వీసు పరిశ్రమలకు రూ. 10 లక్షలుగా ప్రాజెక్టు వ్యయంగా నిర్ణయించారు.అయితే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే సాధారణ కేటగిరీ లబ్ధిదారులు ప్రాజెక్టు వ్యయం మొత్తంలో 10 శాతాన్ని సొంత వనరులుగా పెట్టుబడి పెట్టాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు చెందిన లబ్ధిదారులు ప్రాజెక్టు వ్యయంలో 5 శాతం సొంత వనరులుగా పెట్టుబడి పెట్టాలి.
సాధారణ కేటగిరీ లబ్ధిదారుల ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం మొత్తాన్ని, వెనుకబడిన వర్గాలు సంస్థలకు చెందిన లబ్దిదారులకు 95 శాతం మొత్తాన్ని బ్యాంకులు రుణంగా మంజూరు చేసి రుణం మొత్తం సొమ్మును లబ్ధిదారుడికి అందజేస్తారు. బ్యాంకు ఫైనాన్షియల్‌ బ్రాంచ్‌ ఏదైనా ప్రాజెక్టును మంజూరు చేసిన తర్వాత, రుణంలో మొదటి విడత వాయిదాను విడుదల చేసే ముందు, ప్రతి లబ్ధిదారుడు కేవీఐపీ రాష్ట్ర, ప్రాంతీయ డైరెక్టర్‌ రాష్ట్ర కేవీఐ బోర్డులు, డీఐసీలు ఏర్పాటు చేసిన 10 రోజులు, రెండు వారాలు ఈడీపీ శిక్షణా కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలి.
పీఎంఈజీపీలో లబ్ధిదారుడి పెట్టుబడి 10 శాతం సబ్సీడీ పట్టణ ప్రాంతంలో 15 శాతం, గ్రామీణ ప్రాంతంలో 25 శాతం ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ, వికలాంగులు, మాజీ సైనికులకు చెందిన లబ్ధిదారుడి పెట్టుబడిగా 5 శాతం సబ్సీడీ పట్టణ ప్రాంతంలో 25 శాతం, గ్రామీణ ప్రాంతంలో 35 శాతం ఉంటుంది. ఉత్పత్తి పరిశ్రమ ప్రాజెక్టులకు గరిష్ఠంగా రూ. 25 లక్షలు, సర్వీస్‌ ప్రాజెక్టులకు గరిష్ఠ పరిమితి వ్యక్తులకు, సంస్థలకు రూ. 10 లక్షలు ఇస్తారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకంపై యువతలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టు రిపోర్ట్సు తయారు చేయడంలో మెళుకువలు, బ్యాంకులో సమర్పించాల్సిన డాక్యుమెంట్లపై అవగాహన కల్పించడం వల్ల యువతలో ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. జిల్లా పరిశ్రమల శాఖ, లీడ్‌ బ్యాంకులు వివిధ ప్రాంతాల్లో అవగాహాన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మరింత మంది పథకాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు www. kvconline.gov.in క్లిక్‌ చేసి పీఎంఈజీపీఐ పోర్టల్‌లోకి వెళ్లాలి. అనంతరం దరఖాస్తు ఫారాన్ని ఎంపిక చేసుకోవాలి. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులైతే కేవీఐసీ పట్టణ నిరుద్యోగులైతే డీఐసీలో వివరాలను నమోదు చేయాలి. దరఖాస్తు ఫారాన్ని ప్రింట్‌ తీసుకోవాలి.
పబ్లిక్‌ సెక్టార్‌, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సిడ్బీ, ఐఎన్‌జీ వైశ్యా బ్యాంకు, కరూర్‌ వైశ్యా బ్యాంకు, కర్ణాటక బ్యాంకు యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ, ధనలక్ష్మి బ్యాంక్‌ లిమిటెడ్‌, లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌, సౌత్‌ ఇండియా బ్యాంకు లిమిటెడ్‌, ఫెడరల్‌ బ్యాంకు లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లిమిటెడ్‌, తమిళనాడు మార్కన్‌టైల్‌ బ్యాంకు, డిస్ర్టిక్ట్‌ సెంట్రల్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు లబ్ధిదారుల ఎంపిక జిల్లాస్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. కమిటీలో కేవీఐసీ, రాష్ట్ర కేవీఐ బోర్డులు, డీఐసీలు బ్యాంకులు ప్రతినిధులు ఉంటారు.
అభ్యర్థుల అర్హతలు :

  • వయసు 18 సంవత్సరాలు పైన గల వ్యక్తి
  • పి‌ఎం‌ఈ‌జి‌పి కింద ప్రాజెక్టులు ఏర్పాటు చెయ్యడానికి ఆదాయపరిమితి లేదు. కానీ ఈ సౌకర్యం పి‌ఎం‌ఈ‌జి‌పి కింద అధికారికంగా మంజూరు చేయబడిన కొత్త ప్రాజెక్టులకు మాత్రమే.
  • వ్యాపార / సేవా రంగంలో Rs.5.00 లక్షల పైన మరియు తయారీ రంగంలో Rs.10.00 లక్షల పైన ఖరీదు గల ప్రాజెక్టుల ఏర్పాటుకు, లబ్ధిదారులు కనీసం ఎనిమిదవ తరగతి పాస్ విద్యార్హత కలిగి ఉండాలి.
  • స్వయం సహాయక బృందాలు (ఏ ఇతర పథకాల కింద ప్రయోజనాలు పొందని బిపిఎల్ కు చెందిన వారితో కలిపి) అర్హులు.
  • (వ్యక్తి మరియు తన భార్య/భర్త కలిపి) ఒక కుటుంబం నుండి ఒక వ్యక్తి మాత్రమే అర్హుడు
  • ఇప్పటికే ఉన్న యూనిట్లు / ఏ ఇతర పథకం కింద అయినా ప్రభుత్వం సబ్సిడీ వాడుకున్న యూనిట్లకు అర్హత లేదు.
  • గ్రామీణ పరిశ్రమలతో సహ సాధ్యపడే అన్ని కొత్త సూక్ష్మ సంస్థలకు వర్తిస్తుంది (ప్రతికూల జాబితాలో ఉన్న వాటికి తప్ప)

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Business Ideas: Worried about not having a job? . However, the center will offer Rs. 25 lakhs. . . Like life changing. . ."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0