Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A huge shock to bank customers ATM charges increase?

బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్ 
ATM చార్జీల పెంపు ?

A huge shock to bank customers  ATM charges increase?

 బ్యాంక్ ఖాతాదారులకు షాక్ తప్పేలా లేదు . ATM చార్జీలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి . దీంతో ATM నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకోవడం , బ్యాలెన్స్ చెక్ చేయడం వంటివి మరింత భారం కావొచ్చు . దీంతో బ్యాంక్ కస్టమర్లపై నేరుగానే ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది . ఈ ATM ఆపరేటర్ల అసోసియేషన్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) కు లేఖ రాసింది . క్యాష్ విత్ డ్రాయెల్స్ పై కస్టమర్లు చెల్లించే ఇంటర్ ఛేంజ్ ఫీజును పెంచాలని ఆపరేట్లు కేంద్ర బ్యాంక్ను కోరారు . లేదంటే వ్యాపారాలు దెబ్బతింటాయని తెలిపారు . RBI బ్యాంక్ ఇటీవలనే ATM ల సెక్యూరిటీ , మెయింటెనెన్స్ నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే . కొత్త ప్రమాణాలను కూడా తీసుకువచ్చింది . దీంతో ఆపరేటర్లకు ATM నిర్వహణ భారమైంది . దీంతో ఇంటర్ ఛేంజ్ ఫీజును పెంచాలని ఆపరేటర్లకు లేఖ రాశారు . RBI కూడా వీరి లేఖకు సానుకూలముగా స్పందించే అవకాశ ముందని నిపుణులు పేర్కొంటున్నారు . 
దేశంలో ATM ల విస్తరణ చాలా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు . కొత్త ATM ల సంగతి ఏమో కాని . . ఉన్న ATM లను మూసేస్స్నురు . అలాగే చాలా చోట్లు ATM లు కూడా సరిగా పనిచేయవు . ఇలాంటి నేపథ్యంలో ATM ఆపరేట్లు కూడా చేతులెత్తేస్తే పరిస్థితులు మరింత జరిలంగా మారొచ్చు . RBI ప్రస్తుత రూల్స్ ప్రకారం చూస్తే . . . ఇంటర్ ఛేంజ్ ఫీజు లావాదేవీకి రూ . 15గా ఉంది . ఒక కస్టమర్లకు ఐదు లావాదేవీలు ఉచితంగా లభిస్తాయి . ఇకపోతే ఏటీఎం ఆపరేటర్లు చేతులెత్తేస్తే బ్యాంకులు , వైట్ లేబుల్ ATM ఆపరేటర్లు కూడా కొత్తగా ఏర్పాటు చేసే ఏటీఎంపై ప్రతికూల ప్రభావం పడొచ్చు RBI గతేడాదిలోనే ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది . ఈ కమిటీ డిసెంబర్ నెలలో తన నివేదికను RBI కి అందజేసింది . ఈ ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ కూడా ఇంటర్‌ఛేంజ్ ఫీజును పెంచాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది . అందువల్ల RBI కూడా చార్జీల పెంపుపై సానుకూలముగా స్పందించొచ్చు . పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే . . అంటే 10 లక్షలకు పైన జనాభా ఉంటే . . అక్కడ ATM ఇంటర్ ఛేంజ్ ఫీజును రూ . 17గా నిర్ణయించాలని కమిటీ సూచించింది . ఆర్థిక లావాదేవీలకు ఇది వర్తిస్తుంది . నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఈ చార్జీలను రూ . 7గా నిర్ణయించాలని తెలిపింది .
గ్రామీణ ప్రాంతాలు  పాక్షిక పట్టణ ప్రాంతాల్లో 
అంటే 10 లక్షలలోపు  జనాభా ఉన్న చోట్ల ఇంటర్ ఛేంజ్ ఫీజులను రూ . 18గా నిర్ణయించాలని కమిటీ సిఫార్సు చేసింది . ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఇది వర్తిస్తుంది . అదే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు రూ . 8 ఫీజు వసూలు చేయాలని సూచించింది . ఆరుగురు సభ్యుల కమిటీ కేవలం ఏటీఎం ఇంటర్ ఛేంజ్ ఫీజు పెంపును మాత్రమే కాకుండా ATM లావాదేవీలపై కూడా పలు సిఫార్పులు చేసింది . ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యను తగ్గించాని రికమెంట్ చేసినట్లు తెలుస్తోంది . ఫ్రీ ట్రాన్సాక్షన్లను మూడుకు పరిమితం చేయాలని సూచించింది . RBI లేటెస్ట్ డేటా ప్రకారం . . దేశవ్యాప్తంగా 2 , 27 , 000 ఏటీఎంలు ఉన్నాయి . వీటిల్లో 21 , 200 ఏటీఎంలు వైట్ లేబుల్ ATM లు . మిగతావి బ్యాంకులవి . 2018లో ATM పెరుగుదల ఎక్కువగా ఉంది . ఆ తర్వాత బ్యాంకులు అధిక వ్యయాల కారణంగా కొత్త ATM ల జోలికి వెళ్లడం తగ్గించేశాయి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "A huge shock to bank customers ATM charges increase?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0