Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Caution that millions of PAN cards will be canceled if they are not linked to Aadhaar card.

కోట్లాది పాన్ కార్డులు ఆధార్ కార్డ్ తో లింక్ చేయక పోతే రద్దవుతాయని హెచ్చరిక.


పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయక ఆ కార్డులు చెల్లబోవని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించనుంది. ఇలా లింక్ చేయని పాన్ కార్డులు ప్రస్తుతం 17 కోట్లకు పైనే ఉన్నట్లు అంచనా. దేశం మొత్తం మీద ఇప్పటివరకు జారీ అయిన పాన్ కార్డులు 48 కోట్లకు పైగానే. వీటిలో 17 కోట్లకు పైనే పాన్ కార్డులకు ఆధార్ నెంబర్ లింక్ చేయలేదు. పాన్ కార్డ్-ఆధార్ నెంబర్లను లింక్ చేయాలంటూ ఆదాయపు పన్ను శాఖ చాలా కాలంగా కోరుతోంది.
ఇప్పటికే ఎనిమిది సార్లు గడువు పెంచింది. 2020 మార్చి 31 వరకు గడువు పొడిగిస్తూ చివరిసారి ఆదేశాలు జారీ చేసింది. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇన్నిసార్లు గడువు పొడిగించినా ఇంకా ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు 17 కోట్ల పైగానే ఉండడం గమనార్హం.
ఫైనాన్స్ బిల్- 2019 సవరణ నేపధ్యంలో... ఆధార్‌తో లింక్ అనుసంధానం కాని పాన్ కార్డులు చెల్లవని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదే నిర్ణయం జరిగినపక్షంలో... ఆ కార్డుల వాడకం ఇక సాధ్యం కాదు. మొన్న జనవరి వరకు 30.75 లక్షల పాన్ కార్డులను ఆధార్ నెంబర్‌తో లింక్ చేశారని, ఇంకా ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు 17.58 కోట్ల వరకూ ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్‌సభకు వెల్లడించిన విషయం విదితమే.
ఆదాయపు పన్ను మోసాలు, మనీ లాండరింగ్, కార్డుల డూప్లికేషన్ లాంటివి అరికట్టేందుకు పాన్
నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి చేసింది ఆదాయపు పన్ను శాఖ.
How to link your Adhar and Pan Card

               VIEW THE VIDEO


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Caution that millions of PAN cards will be canceled if they are not linked to Aadhaar card."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0