Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Changes in 10th class exams

  • ' పది ' పరీక్షల్లో సమూల మార్పులు
  •  సబ్జెక్టు పేపర్ వారీగా గ్రేట్లు
  •  24 పేజీల సమాధానపత్రాలు 
  • అంతర్గత మార్కులు , బిట్ పేపర్లు రద్దు 
  • ఆంధ్రజ్యోతి ' తో డీఈవో సుబ్బారావు 
Changes in 10th class exams

సంస్కరణలలో భాగంగా మార్చిలో జరగ నున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది . పరీక్షల్లో ఉత్తీర్ణత , గ్రేడ్ల కేటాయింపు , ఇతర మార్కులపై జిల్లా విద్యా శాఖాధికారి వీఎససుబ్బారావు ఆంధ్రజ్యోతికి వివరించారు . 
పరీక్షలకు సంబం ధించి కొన్ని సామాజిక మాధ్యమాలలో వస్తున్న వివరాలపై విద్యార్థులు , తల్లిదం డ్రులు అపోహలకు గురికావద్దని ఆయన తెలిపారు .


  •  పదవతరగతి పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కుల భారాన్ని తొలగించారు . 
  • గత ఏడాది వరకు 20శాతం ఇంటర్నల్ మార్కులు ఉండేవి . ప్రస్తుతం దానిని రద్దు చేశారు . 
  •  ప్రశ్నపత్రంలో గతంలో మాదిరి పార్టు - ఎ , పార్టు - బి ( బిట్వీపర్ ) వేరువే రుగా కాకుండా లక్ష్యాత్మక ప్రశ్నలు కూడా కలిపి ఒకే ప్రశ్నపత్రం ఇస్తారు . 
  •  విద్యార్థి రాయాల్సిన ప్రశపత్రాల సంఖ్యలో ఎటువంటి మార్పులేదు . గతంలో మాదిరిగానే ఆరు సబ్జెక్టులను 11 పేపర్లుగా రాయాల్సి ఉంటుంది . 
  • ఇంట ర్నరల్ మార్కులు లేవు కనుక విద్యార్థులు ప్రతి సబ్జెక్టును వంద మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది . 
  •  పరీక్ష కాల వ్యవధి గతంలో మాదిరిగానే 2 . 45 గంటలు ఉంటుంది . 
  • ప్రశ్న పత్రం చదివేందుకు 15 నిమిషాలు , రాసేందుకు రెండు గంటల వరకు ఉంటుంది . 
  • పరీక్షకు 3 . 15 గంటల వ్యవధి ఉంటుంది . 
  •  ప్రస్తుత పరీక్షల నుంచి విద్యార్థులకు ఇంటర్మీడియేట్ తరహా 24 పేజీల ఆన్సర్ బుక్ట్ ఇస్తారు .
  •  ఈ బుక్ లోనే విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధా నాలు రాయాల్సి ఉంటుంది . 
  •  విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో 35 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులు అవుతారు .
  •  హిందీలో మాత్రం 20 మార్కులే ఉత్తీర్ణత . 
  •  ఒక సబ్జెక్టులో రెండు పేపర్లు ఉంటే రెండు పేపర్లలో విద్యార్థులు సాధిం చిన మొత్తం మార్కులను ప్రాతిపదికన తీసుకొని విద్యార్థులను ఉత్తీర్ణులైనట్లు ప్రకటిస్తారు . 
  •  ఒక విద్యార్థి 10 / 10 గ్రేడ్ సాధించాలంటే రెండు పేపర్లలో కలిపి 92 మార్కులు సాధించాల్సి ఉంటుంది . అదే హిందీలో అయితే 90 మార్కులు సాధి స్తేనే 10 / 10 గ్రేడ్ పాయింట్లు కేటాయిస్తారు . 
  •  విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో ప్రతి పేపర్లో సాధించిన మార్కులు , గ్రేడ్ వివరాలను విద్యార్థుల మార్కుల జాబితాలో ఇస్తారు . 
  • మొత్తం గ్రేడు విద్యార్థుల అన్ని సబ్జెక్టుల్లో సాదించిన మార్కుల ఆధారంగానే కేటాయిస్తారు . 
  • ప్రశ్నపత్రంలో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి .
  •  ప్రస్తుతం బిట్ పేపర్ లేనందున మొత్తం 33 ప్రశ్నలను 50 మార్కులకు ఇస్తున్నారు . 
  • వీటిలో వ్యాస రూప ప్రశ్నలు ఐదు , లఘ ప్రశ్నలు 8 , అతిలఘ ప్రశ్నలు 8 , అబ్జెక్టివ్ టైషుప్ర శ్నలు 12 ఉంటాయి . 
  •  విద్యార్థులకు మార్కులు జాబితాలో ప్రతి పేపర్ లో సాధించిన గ్రేడు చూపిస్తారు .
  •  అయితే సబ్జెక్ట్ గ్రేడ్ మొత్తం రెండు పేపర్లలో సాధించిన మార్కుల ఆధారంగానే కేటాయిస్తారు . 
  •  జీపీఎ పాయింట్ల కేటాయింపు పద్ధతిలో ఎటువంటి మార్పు లేదు .
  •  పదవ తరగతి పరీక్షల కోసం పిల్లలను మానసికంగా సంసిద్ధం చేయాలి . 
  • వారు చక్కగా పరీక్షలు రాసేందుకు ఒత్తిడి లేని వాతావరణాన్ని తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు కల్పించాలని డీఈవో సూచించారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Changes in 10th class exams"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0