Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How should new returns be filed?

కొత్త రిటర్నులు ఎలా దాఖలు చేయాలి?
How should new returns be filed?

పన్ను చెల్లింపుదారుల అవసరాలను, వారి టర్నోవర్‌ ఆధారంగా మూడు రకాల రిటర్నులను ప్రవేశపెట్టడం జరిగింది. వార్షిక టర్నోవర్‌ రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఉన్నవారు జీఎస్టీ ఆర్‌ఈటీ-1 అనే నెలవారీ రిటర్న్‌ను ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. దీనినే నార్మల్‌ రిటర్న్‌ అని కూడా అంటారు. అలాగే వార్షిక టర్నోవర్‌ రూ.5 కోట్ల కంటే తక్కువ ఉన్న వారు జీఎస్టీ ఆర్‌ఈటీ-2 లేదా జీఎస్టీ ఆర్‌ఈటీ-3 అనే త్రైమాసిక రిటర్న్‌ను ఫైల్‌ చేయవచ్చు.

సహజ్‌ అని పిలిచే జీఎస్టీ ఆర్‌ఈటీ-2 రిటర్న్‌ను కేవలం బీ2సీ సరఫరాలు మాత్రమే జరిపే వ్యాపారులు దాఖలు చేయవచ్చు. అలాగే సుగమ్‌ అని పిలువబడే జీఎస్టీ ఆర్‌ఈటీ-3 రిటర్న్‌ను కేవలం బీ2బీ, బీ2సీ సరఫరాలు జరిపే వ్యాపారులు దాఖలు చేయవచ్చు. అయితే నార్మల్‌ రిటర్న్‌ను నెలవారీ పద్ధతిలో వార్షిక టర్నోవర్‌ రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఉన్నవారు కచ్చితంగా ఫైల్‌ చేయాల్సి ఉండగా, వార్షిక టర్నోవర్‌ రూ.5 కోట్ల కంటే తక్కువ ఉన్నవారు ఇదే రిటర్న్‌ను త్రైమాసిక రిటర్న్‌ కింద ఐచ్ఛికంగా ఫైల్‌ చేయవచ్చు. అలాగే, ఏ రిటర్న్‌ ఫైల్‌ చేసినప్పటికీ దీనికి అనుబంధంగా రెండు ఫార్మ్స్‌ ఉంటాయి. వీటిని జీఎస్టీ ఏఎన్‌ఎక్స్-1, జీఎస్టీ ఏఎన్‌ఎక్స్-2 అంటారు. జీఎస్టీ ఏఎన్‌ఎక్స్-1 అనేది ఒక వ్యక్తి అమ్మకాలకు సంబంధించినది కాగా, జీఎస్టీ ఏఎన్‌ఎక్స్-2 అనేది కొనుగోళ్లకు సంబంధించింది. అంటే సరఫరాదారుడు జీఎస్టీ ఏఎన్‌ఎక్స్-1 లో నింపే వివరాలు కొనుగోలుదారుని జీఎస్టీ ఏఎన్‌ఎక్స్-2 లో కనిపిస్తాయి. దీనివల్ల కొనుగోలుదారుడు సులువుగా క్రెడిట్‌ తీసుకోవటానికి వీలవుతుంది. అలాగే జీఎస్టీ ఏఎన్‌ఎక్స్-1 ఆధారంగా అమ్మకందారుడు పన్ను కట్టటం సులువు అవుతుంది.

ఇంతకుముందు జీఎస్టీఆర్-1 రిటర్న్‌ ఉన్నప్పటికీ దానికి, జీఎస్టీ ఏఎన్‌ఎక్స్-1 కు మౌఖికపరమైన తేడాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు ఏదేనీ ఇన్వాయిస్‌ ఇవ్వగానే దాని వివరాలను అమ్మకందారుడు వెనువెంటనే జీఎస్టీ ఏఎన్‌ఎక్స్-1లో నింపవచ్చు. అలాగే కొనుగోలుదారుడు కూడా ఆ వివరాలను ఎప్పటికప్పుడు చూడటంతో పాటు ఆ ఇన్వాయి్‌సను లాక్‌ చేయవచ్చు. ఒకసారి లాక్‌ చేసిన ఇన్వాయి్‌సను అమ్మకందారుడు మార్చలేడు. అలాగే, ఇప్పుడు ఉన్న పద్ధతిలో రిటర్నులను సవరించే (అమెండ్) సౌకర్యం లేదు. కానీ, కొత్త పద్ధతిలో ఒకసారి రిటర్న్‌ ఫైల్‌ చేసిన తర్వాత అవసరం అనుకుంటే సవరణ చేయవచ్చు. అలాగే నిల్‌ రిటర్నులను సులభంగా ఒక ఎస్‌ఎంస్‌ ద్వారా ఫైల్‌ చేయవచ్చు. అయితే ముఖ్య విషయం ఏమిటంటే నెలవారీ రిటర్న్‌ అయినా త్రైమాసిక రిటర్న్‌ అయినా పన్ను చెల్లింపు మాత్రం కచ్చితంగా నెలవారీగా చేయాల్సి ఉంటుంది.

గమనిక : ఈ వ్యాసాల ద్వారా ఇస్తున్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పాఠకులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత చట్టాలు/నిబంధనలను కూలంకషంగా పరిశీలించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How should new returns be filed?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0