Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jaganna Vidhya Vasathi Deevena Schemes Financial Assurance for Higher Education Registration process to end with 12 of this month!

జగనన్న విద్యా, వసతి దీవెన పథకాలు
ఉన్నత చదువులకు ఆర్థిక భరోసా
12తో ముగియనున్న నమోదు ప్రక్రియ..!
Jaganna Vidhya Vasathi Deevena Schemes  Financial Assurance for Higher Education  Registration process to end with 12 of this month!

త్వరలో కళాశాల, గ్రామ-వార్డు సచివాలయల్లో విద్యార్థుల జాబితా
20న ప్రారంభకానున్న జగనన్న విద్యా, వసతి దీవెన పథకాలు
ప్రభుత్వం ఉన్నత విద్యా కోర్సుల చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలను ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించడానికి కార్యాచరణ ప్రారంభించింది.*
ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, ఇతర ఉన్నత విద్యాకోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఆర్థిక భరోసా దొరకనుంది.
ఈ నమోదు ప్రక్రియ ఈ నెల 12తో ముగియనున్నట్లు అధికారులు చెబుతున్నారు

నవశకం ద్వారా వివరాల సేకరణ

గతేడాది డిసెంబరులో ప్రభుత్వం చేపట్టిన వైఎస్సాఆర్‌ నవశకం ద్వారా ఈ పథకాలకు సంబంధించి సర్వే చేశారు. సచివాలయం ఉద్యోగులు, వలంటీర్లు వివరాలు సేకరించారు. వీటిని నవశకం వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. అవి ఇప్పటికే ప్రభుత్వానికి చేరాయి. వీటిని గ్రామ-వార్డు సచివాలయాల్లో ప్రయోగత్మకంగా ముందే అందుబాటులో ఉంచారు. తిరిగి వీటి నమోదుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో నమోదు పక్రియ జరుగుతుంది. విద్యా దీవెనకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తిగా ఆయా కళాశాల ఖాతాకు చెల్లించనుంది.

రెండు దఫాలుగా తల్లిఖాతాలకు

ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు తల్లి ఖాతాకు తొలివిడతలో రెండు విడతలుగా జమ చేయనున్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 20, జూన్‌లో ఖాతాలో వేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి విద్యా సంవత్సరం మధ్య, చివర దశలో జమ చేస్తారని అధికారులు చెబుతున్నారు.

కళాశాలల యాజమాన్యం ఇలా చేయాలి..


  • పథకానికి సంబంధించిన ఉత్తర్వులు నోటీస్‌ బోర్డులో ఉంచాలి.
  •  ప్రతి తరగతికి పథకానికి సంబంధించి విధివిధానాలను సర్య్కులర్‌ రూపంలో విద్యార్థులకు తెలియజేయాలి.
  •  నోటీస్‌ బోర్డులో నమోదైన విద్యార్థుల వివరాలు ఉంచాలి. 
  • అందులో అర్హులు, అనర్హుల జాబితాను ప్రదర్శించాలి.
  • విద్యార్థుల చరవాణి నెంబర్లకు పథకానికి సంబంధించిన వివరాలు తెలుగులో సందేశం పంపాలి.
  • నమోదు ప్రక్రియ పూర్తయిన తరువాత విద్యార్థులతో సమావేశం నిర్వహించి. 
  • అర్హుల, అనర్హుల సమాచారం ఇవ్వాలి.
  • విద్యార్థుల తల్లి ఖాతా (వినియోగంలో ఉన్న) నెంబరును తీసుకోవాలి. 
  • వీటితో పథకానికి సంబంధించి ధ్రువపత్రాలు తీసుకోవాలి.

ఇలా ఉంటే అనర్హులే..


  • విద్యార్థి హాజరు 75శాతంలోపు ఉండకూడదు.
  • విద్యార్థి కుటుంబంలో (రేషన్‌కార్డులో సభ్యులు) ఎవరైనా ఆదాయపన్ను చెల్లించినా..
  • కన్వీనర్‌ కోటా (సెట్‌ పరీక్షలు ద్వారా) కళాశాలలో చేరకపోయినా..
  • కుటుంబానికి సంబంధించిన పొలం 25 ఎకరాల దాటి ఉండకూడదు (పల్లం, మెట్ట)
  • దూరవిద్యాకోర్సుల్లో చదువుతున్న వారికి రాదు..
  • ఏడాదికి 2,50,000లు ఆదాయం దాటిన ఏ కులస్థులకైనా ఈ పథకం వర్తించదు.
  • గులాబీ కార్డులు ఉన్న వారు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు రాదు.. 
  • బీ పట్టణ ప్రాంతాల్లో 1500 చ.అడుగుల స్థలం ఉన్న వారికి రాదు
  • నాలుగు చక్రాల కారు ఉంటే వర్తించదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jaganna Vidhya Vasathi Deevena Schemes Financial Assurance for Higher Education Registration process to end with 12 of this month!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0