Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

jobs: Teacher jobs in America. . . Apply this

Jobs : అమెరికాలో టీచర్ జాబ్స్ . . . ఇలా అప్లై చేసుకోండి . . .
jobs: Teacher jobs in America. . . Apply this

America Jobs : అమెరికాలో ఉద్యోగం అంటే ఎగిరి గంతెయ్యొచ్చు . లైఫ్ టర్న్ అయినట్లే . మరి ఆ ఉద్యోగాలేంటో , ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం .

America Jobs : అమెరికా... టెక్సాస్‌లోని కొన్ని స్కూళ్లలో టీచర్ల కొరత వచ్చింది. ఎవర్నో ఎందుకు తెలుగు వాళ్లనే నియమిద్దామని అనుకున్నారు. కాబట్టి... అక్కడ ఉద్యోగం చెయ్యాలనుకునేవారు అప్లికేషన్ పెట్టుకోమని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT) కోరుతోంది. ఏ సబ్జెక్టులు బోధించాలంటే... ఇంగ్లీష్, లేదా ప్రత్యేక విద్య (స్పెషల్ ఎడ్యుకేషన్) చెప్పేందుకు ఆసక్తి, అర్హత ఉన్న ఉపాధ్యాయులు అప్లై చేసుకోవచ్చు. ఇంతకీ అర్హతలు చెప్పలేదు కదూ. B.ed లేదా M.ed కలిగి... టీచింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంటే చాలు. స్పెషల్ ఎడ్యుకేటర్‌గా గుర్తింపు ఉన్న ఉపాధ్యాయుల్ని తీసుకునే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఐతే... ఎవరైనా సరే వీసా పొందాలంటే... టోఫెల్ ఎగ్జామ్ రాయాలి. అందులో పాస్ అవ్వాలి. ఈ ఉద్యోగాల నియామకానికి ఏ ఫీజులూ తీసుకోవట్లేదు. కాబట్టి ఆసక్తి ఉంటే... ఆలస్యం చెయ్యకుండా... మార్చి 5 లోపు... https://dev.apnrts.ap.gov.in/home/teacherjobs లోకి వెళ్లి... అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంత వివరంగా చెప్పిన వాళ్లు... మరి శాలరీలు ఇతర విషయాలేవీ చెప్పలేదేంటని అనుకోవచ్చు. వాటి వివరాలు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత చెబుతారు.

Jobs : అమెరికాలో టీచర్ జాబ్స్... ఇలా అప్లై చేసుకోండి...

మొత్తం 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్లెమ్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ ఇండియా అధ్వర్యంలో టెక్సాస్‌లోని స్కూళ్లలో టీచింగ్ పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. ఎంపికైన ఉపాధ్యాయులు మూడేళ్ల గడువు కలిగిన జే1 వీసా పొందుతారు. ఆ వీసాను మరో రెండేళ్లు పొడిగించేందుకు అవకాశం ఉంది. అంటే మొత్తం ఐదేళ్లపాటూ అమెరికాలో ఉంటూ... టీచింగ్ జాబ్ చేసుకోవడానికి వీలవుతుంది. మరి ఇంకెందుకాలస్యం త్వరపడండి. అరుదైన అద్భుతమైన ఛాన్స్. వదిలేస్తే... మళ్లీ ఎప్పుడొస్తుందో చెప్పలేం అంటున్నారు ఉద్యోగాల నిర్వాహకులు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "jobs: Teacher jobs in America. . . Apply this"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0