Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Let the kids play outside. Set aside at least 20 minutes per day

పిల్లల్ని బయటే ఆడుకోనివ్వండి.
రోజుకు కనీసం 20 నిమిషాలు కేటాయించండి 
ఇలా చేస్తే జబ్బులు , కేన్సర్లు రావు 'ఈనాడు ' తో ఎయిమ్స్ వైద్యుడు , పద్మశ్రీ గ్రహీత లలిత్ కుమార్ 
OUTDOOR GAMES FOR CHILDREN


  • భానుడి కిరణాల తాకిడిలో తుళ్లింతలు . . గాలి కెరటాల్లో కేరింతలు , 
  • చెట్ల కింద మట్టి గూడుల ఆటలు 
  • ఇలాం టివి ఈనాటి పిల్లలకు ఎంతమందికి అందుతున్నాయో తెలీదు కానీ . . 
  • ఇవి లేక చాలా మందిలో అనేక జబ్బులు వస్తున్నాయన్నది మింగుడు పడని సత్యం మేలుకోండి తల్లిదండ్రులూ . . 
  • పిల్లల్ని బయటకు వెళ్లనివ్వండి . 
  • ఎండలో కాసేపు ఆడుకోనివ్వండి . . బయట గడిపే సమయం ఎంత పెరిగితే అంత మేలు .




 పదేళ్ల క్రితం పాఠశాల వయసు పిల్లల్లో 2 . 5 శాతం మందికి కేన్సర్ ఉండేది . ఇప్పుడా సంఖ్య 5 - 6 శాతానికి వచ్చింది . రక్త సంబంధ ఇబ్బందులూ అంతకంతకూ పెరు గుతున్నాయి . జీవనశైలిలో ప్రమాదకర మార్పులు రావడమూ ఇందుకు ఓ కార ణంగా తెలుస్తోందని అంటున్నారు . దిల్లీ ఎయిమ్స్ అంకాలజీ విభాగాధిపతి , పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ లలిత్ కుమార్ , తక్కువ ధరకే మూలకణాలు , ఎముక మజ్జ మార్పిడిలో విప్లవాత్మక మార్పులు తెచ్చారీ యన . ఆదివారం విశాఖకు వచ్చిన లలితక్కు మార్ ' ఈనాడు ' తో మాట్లాడారు . 
ఆ వివరాలు ఆయన మాటల్లోనే 
  • పిల్లల్లో రక్త సంబంధ ఇబ్బందులు సాధార ణమైపోయాయి . 
  • 10 - 15 ఏళ్లతో పోల్చి చూస్తే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా ( ఏఎల్ ఎల్ ) ప్రస్తుతం ఎక్కువగా వస్తున్నట్లు నిర్ధా రణ అవుతోంది .
  •  ఇది పలు రకాల ఇన్ ఫెక్షన్ల ద్వారా , రోగ నిరోధక వ్యవస్థ తగ్గడం ద్వారా పిల్లల్లో వృద్ధి చెందడానికి కారణం . 
  • ఎలాంటి ఇన్ఫెక్షన్ల కారణంగా రక్తంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయనేది ఇంకా తేలలేదు . 
  •  గతంలో పిల్లలు బయటే ఆడుకునేవారు . ఇప్పుడు ఫోన్లు , బొమ్మలతో ఇళ్లకే పరిమి తమవుతున్నారు . 
  • ఈ తరహా అలవాట్లతో వారిలో రోగ నిరోధకశక్తి తగ్గి . . ఇన్ ఫెక్షన్ల ప్రభావంతో రక్తకణాలు , డీఎన్ఎల్లో మార్పులు వస్తున్నాయి .
  •  వీటిలోని ప్రమాద కర స్వతంత్ర కణాలు పెరిగి పలు వ్యాధులు వచ్చేలా చేస్తున్నాయి . 
  • ఏఎల్ లాంటి కేన్సర్లకూ కారకాలవు తున్నాయి .
  •  బలహీనంగా ఉన్న పిల్లల్లో అప్లాస్టిక్ అనీమియా కనిపిస్తోంది . వీరిలో రక్తం తయారవకపోవడం లాంటి లక్షణాలుంటున్నాయి.
  • దశాబ్దకాలంలో ఇలాంటి పిల్లల సంఖ్య పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి . 
  • రోజుకు కనీసం 15 - 20 నిమిషాలైనా పిల్లలు పగలు బయట తిరగడం మొదలు పెడితే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది . 
  • తద్వారా ఇన్ ఫెక్షన్లతో పోరాడేతత్వం వస్తుంది . కేన్సర్లను గుర్తించే ఆసుపత్రులు , డయాగ్న స్టిక్ సాంకేతికత దేశంలో బాగా పెరిగింది .
  • ప్రజల్లో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా ( ఏఎల్ ) , అక్యూట్ మైలోయిడ్ లుకే మియా ( ఏఎంఎల్ ) కేన్సర్లు బాగా పెరి గాయి .
  • క్షేత్ర స్థాయిలోని ఫిజీషియన్లకూ అవగాహన లేకపోవడంతో జబ్బులు వచ్చే దాకా జనాలకు తెలియని పరిస్థితి ఉంది . 
  • ప్రస్తుతం 150 జిల్లాల్లో రొమ్ము కేన్సర్ పై క్షేత్రస్థాయి సిబ్బంది నిర్ధారణ చేసేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు .


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Let the kids play outside. Set aside at least 20 minutes per day"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0