Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Many uses with garlic ..

వెల్లుల్లితో ఎన్నో ఉపయోగాలు.. 
Many uses with garlic ..

తెలిస్తే తినకుండా ఉండలేరు
వెల్లుల్లి వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని వైద్యనిపుణులు చెబుతున్న మాట. 
వెల్లుల్లి ప్రతి ఇంట్లో ఉండేదే. వెల్లుల్లిని తరుచూ తీసుకోకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు. ఘాటైన వాసనతో ఉండే వెల్లుల్లిని కొందరు తినడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ దీని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయంటున్నారు నిపుణులు.
పక్షవాతానికి ఎంతో మంచిది
వెల్లుల్లి వల్ల యాంటీ ఆక్సిడెంట్స్‌, సూక్ష్మీక్రిములను చంపేసే యాంటి మైక్రోబయల్‌, విష పదార్ధాలను సైతం బయటకు పంపే యాంటీ సెప్టిక్‌ గుణాలు దాగివున్నాయి. వెల్లుల్లిని ప్రతి రోజు ఆహారంలో తినడం వల్ల హైపర్‌ టెన్షన్‌, ఇతర సమస్యలు దూరం అవుతాయి.
తాజాగా దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడంతో ఎన్నో ఆశ్చర్యపోయే నిజాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా వెల్లుల్లిని తినేవారికి పక్షవాతం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ. అంతేకాదు దీనిని పచ్చిగా తినేవారికి అధికంగా లాభం ఉంటుందంటున్నారు.
మధుమోహం ఉన్నవారికి..
ఈ రోజుల్లో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా మధుమోహం బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. నిత్యం ఆహారంలో వెల్లుల్లిని తీసుకుంటే షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్లో ఉంటాయట. వెల్లుల్లిలో మధుమోహాన్ని తగ్గించే గుణం ఉంది.
గుండె సమస్యలకూ..
వెల్లుల్లి గుండె సమస్యలకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే శరీరంలో వ్యర్థపదార్థాలను పోగొట్టే గుణాలు చాలా ఉన్నాయి. దీని వల్ల శరీరానికి మేలు చేసే హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ని పెంచడమే కాకుండా శరీరానికి హాని కలిగించే ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. దీని వల్ల రక్తనాళాలు కూడా మెరుగ్గా ఉండేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. వెల్లుల్లి వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
కొవ్వును కరిగిస్తుంది
వెల్లుల్లి శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. మెటబాలిజం పెంచుతుంది. అంతేకాదు జీర్ణ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. దీని వల్ల బరువు కూడా తగ్గిపోతారు. బరువు తగ్గాలనుకునే వారికి ఉదయం పూట పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
వెల్లుల్లి వల్ల మతిమరుపు తగ్గుతుందా?
వెల్లుల్లి తినడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. ఇది తినడం వల్ల మెదడుకు ఆక్సీజన్‌ సరఫరా అయి మెదడు చురుకుగా పని చేస్తుంది. అంతేకాదు మతిమరుపుతో బాధపడేవారికి మంచి ఉపయోగం. మతిమరుపునకు కారణమయ్యే అల్జీమర్స్‌ వ్యాధి రాకుండా ఉపయోగపడుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Many uses with garlic .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0