Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

More benefits from March 1st for those with DTH connection!

DTH కనెక్షన్ ఉన్నవారికి మార్చి 1 నుండి మరిన్ని ప్రయోజనాలు!
More benefits from March 1st for those with DTH connection!


ఇండియాలో ఇటీవలి కాలంలో డిటిహెచ్ కనెక్షన్ల సంఖ్య బాగా పెరిగింది. మామూలు కేబుల్ కనెక్షన్లు క్రమేపీ తగ్గిపోతున్నాయి. డిటిహెచ్ కనెక్షన్ గురించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్చి 1 నుండి కొత్త నియమాలు అందుబాటులోకి తీసుకు వస్తున్న తరుణంలో దానిద్వారా DTH వాడుతున్న వారు కూడా అనేక కొత్త ప్రయోజనాలు పొందబోతున్నారు.

అన్నిటికంటే ప్రధానంగా ఒక bouquetలో గరిష్టంగా కొన్ని ఛానల్స్ ప్రస్తుతం 19 రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. ట్రాయ్ తాజా నియమాల ప్రకారం ఇలా ఒక bouquetలో ఏదైనా ఛానల్ ని పొందుపరచాలి అంటే కచ్చితంగా అది గరిష్ఠంగా 12 రూపాయలకు మించి ధర ఉండకూడదు. పరోక్షంగా ప్రస్తుతం చెల్లిస్తున్న దాని కంటే తక్కువ ధరకు అనేక ఛానెళ్ల ప్యాక్ ను వినియోగదారులు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
మరోవైపు ఇప్పుడు కనీసం 130 రూపాయలు చెల్లించి వినియోగదారులు కేవలం 100 స్టాండర్డ్ చానల్స్ మాత్రమే పొందే అవకాశం ఉంటోంది. వీటిలో 25 ఛానల్స్ కేవలం దూరదర్శన్ అది చానల్స్ మాత్రమే కావడం వల్ల వివరాలు పెద్దగా సంతృప్తి గా లేరు. అయితే ఇకమీదట 130 రూపాయలు బేస్ ధరకి, రెండు వందల ఛానెల్స్ వరకూ ఉచితంగా పొందగలుగుతారు. ప్రధానంగా చెప్పుకోవాల్సింది, ఈ రెండు వందల ఛానళ్ళలో దూరదర్శన్ ఛానళ్లు లెక్కించబడవు. కచ్చితంగా వినియోగదారులకు ఇది శుభవార్త గానే భావించాలి.

మరో ముఖ్యమైన ప్రయోజనం విషయానికొస్తే.. ఒక ఇంట్లో రెండు డిటిహెచ్ కనెక్షన్లు తీసుకోవాలనుకునే వారు ఇక మీదట కేవలం 40 శాతం NCF ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు కావాలనుకునే వారికి కచ్చితంగా ఈ కొత్త నియమం ప్రయోజనకరంగా ఉంటుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "More benefits from March 1st for those with DTH connection!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0