Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Prepared for land records purge in AP

కేసీఆర్ బాటలో జగన్ . . కీలక నిర్ణయానికి రేపే శ్రీకారం . .

ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతున్నారు . తెలంగాణలో సీఎం కేసీఆర్ నిర్వహించినట్లుగానే ఏపీలోనూ భూ రికార్డుల ప్రక్షాళనకు సిద్ధమయ్యారు .

ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నిర్వహించినట్లుగానే ఏపీలోనూ భూ రికార్డుల ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు రేపటి నుంచి ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురితో కూడిన బృందం భూ రీ సర్వే చేయనుంది. స్వాతంత్ర్యం రాకముందు 120 ఏళ్ల క్రితం బ్రిటిష్‌ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా భూములను సర్వే చేసి రీసర్వే రిజిష్టర్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌) తయారు చేశారు. నేటికీ ఇదే ప్రామాణికంగా కొనసాగుతోంది. ప్రతి 30 ఏళ్లకు రీసర్వే చేయాల్సి ఉన్నప్పటికీ చేయలేదు. తరాలు మారడం, కుటుంబాలు విడిపోవడం తదితర కారణాలతో భూములు చేతులు మారడం వల్ల గత 120 ఏళ్లలో భూముల పరంగా చెప్పలేనన్ని మార్పులు జరిగాయి. ప్రభుత్వ భూములకు దరఖాస్తు పట్టాలు (డీకేటీలు) ఇవ్వడం వల్ల సబ్‌డివిజన్లు/ సర్వేనంబర్లు పెరిగిపోయాయి. భూమి హద్దుల విషయంలోనూ వివాదాలు పెరిగాయి. చాలాచోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి.
వాస్తవంగా ఉన్న భూమికి, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న దానికి మధ్య లక్షల ఎకరాల తేడా ఏర్పడింది. దీంతో సివిల్ కేసులు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో భూముల రీసర్వే, శాశ్వత భూ హక్కుల కల్పన పరిష్కారమని ప్రభుత్వం భావిస్తూ రీసర్వేకు పూనుకుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో పైలట్‌ ప్రాజెక్టుకు రేపు శ్రీకారం చుట్టనుంది. ఉదయం 11 గంటలకు జగ్గయ్యపేటలో బేస్‌ స్టేషన్‌ను ప్రారంభించి తక్కెళ్లపాడులో రీసర్వే పైలట్‌ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి శ్రీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మండలంలోని 25 గ్రామాల్లో 66,761 ఎకరాల భూముల్లో రీసర్వే పూర్తి చేస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Prepared for land records purge in AP"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0