Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SSC Recruitment 2020: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి 1157 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.

SSC Recruitment 2020: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి 1157 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
SSC Recruitment 2020: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి 1157 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మొత్తం 1157 ఉద్యోగాలను ప్రకటించింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల్లో గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టులు ఇవి. లైబ్రరీ క్లర్క్, ఆఫీస్ అటెండెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబరేటరీ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ లాంటి పోస్టులున్నాయి. ఫేజ్ 8 సెలక్షన్ టెస్ట్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. సాధారణంగా ఉన్నత ఉద్యోగాల భర్తీని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC చేపడుతూ ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మాత్రం సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్ లాంటి నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.
అందులో భాగంగా ప్రస్తుతం 1157 ఖాళీలను ప్రకటించింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా 10+2, డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 20 చివరి తేదీ. ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు వేర్వేరుగా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.ఆసక్తి గల అభ్యర్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 21
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 20
ఆన్‌లైన్ ఫీజుకు చివరి తేదీ- 2020 మార్చి 23
ఆఫ్‌లైన్ చలానా జనరేట్ చేయడానికి చివరి తేదీ- 2020 మార్చి 23
చలానా ద్వారా పేమెంట్ చేయడానికి చివరి తేదీ- 2020 మార్చి 25కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్- 2020 జూన్ 10 నుంచి 2020 జూన్ 12
మొత్తం ఖాళీలు- 1157
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. విద్యార్హతల వివరాల కోసం నోటిఫికేషన్ చూడండి.
వయస్సు- పోస్టును బట్టి 18 నుంచి 30 ఏళ్ల వయస్సువారు దరఖాస్తు చేయొచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.100.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు- హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

2 Responses to "SSC Recruitment 2020: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి 1157 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు."

  1. मेरे पास कोई रोजगार नहीं है मैं बृजेश कुमार Up Sewayojan नम्र निवेदन करता हूं कि मुझे भी रोजगार देने का कष्ट करें

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0