Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

These are the principles to be followed in order to be good at handwriting

ముత్యాల్లాంటి అక్షరాలతో మంచి మార్కులు!చేతివ్రాతలో మంచిగా ఉండటానికి అనుసరించాల్సిన సూత్రాలు ఇవి
These are the principles to be followed in order to be good at handwriting

పదో తరగతి ఇంటర్మీడియెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు చేతిరాత పై దృష్టి సారించాలని సూచిస్తున్న విద్యా నిపుణులు.

మంచి దస్తూరి నేర్చుకోవడం కూడా విద్యాభ్యాసంలో భాగమే " అని చెప్పారు . మహాత్మా గాంధీ . . " మంచి చేతి రాత మార్పును తలరాత " అంటున్నారు . విద్యావేత్తలు . అవును పరీక్షల్లో ముత్యాల్లాంటి అక్షరాలు మంచి మార్కులు తెచ్చి పెడతాయి . పదో తరగతి ఫలితాలే భవిష్యత్ లో అన్నింటికీ ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉన్నందున విద్యార్థులు టెన్ పరీక్షలను చాలెంజ్ గా తీసుకోవాలి . అంతే కాకుండా ఇంటర్ విద్యార్థులు కూడా సమయాన్ని వృథా చేయకుం డా ప్రణాళిక ప్రకారం అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించడం తోపాటు మంచి చేతి రాతతో ఎక్కువ మార్కులు సాధించవచ్చు . ఉన్నది ఉన్నట్టు రాసినప్పటికీ ఆకట్టుకునే దస్తూరి ఉంటేనే ప్రయోజనం ఉంటుంది . మనం ఏమి రాశామన్నది పేపర్లు మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులు , అధ్యాపకులకు అర్థమైతే ఎక్కువ మార్కులు వేయడానికి అవకాశం ఉంటుంది . సం వత్సరం మొత్తం కష్టపడి చదివిందంతా సంగ్రహిం చి రెండున్నర గంటల్లో ఆన్సర్ షీట్ లో రాయాల్సి ఉంటుంది . విద్యార్థులపై పరీక్ష సమయంలో సహా జంగా ఒత్తిడి ఉంటుంది . మొదటి ప్రశ్నకు జబాబు చక్కగా రాసి తర్వాత వేగంగా రాయండం వల్ల ఆం దంగా రాయలేకపోతుం టారు . దీనిని అధిగమిం చడానికి ముందుగానే మంచి దస్తూరీపై ఇప్పటి నుంచే దృష్టి సారిస్తే పరీక్షల్లో ఇబ్బందులు ఉం డవని నిపుణులు సూచిస్తున్నారు .

హ్యాండ్ రైటింగ్ కు పాటించాల్సిన సూత్రాలు


  • పేజీ పైభాగంలో ఒక అంగుళం , ఎడమ వైపు అంగుళం మార్జిన్ విడిచి పెట్టాలి . 
  • సమాధాన పత్రంలో రాసే జవాబు సూటిగా ఉండటంతోపాటు అక్షరాలు పొందికగా ఉండాలి.
  • అక్షరాలు వంకరటింకరగా , గజిబిజిగా ఉంటే మార్కులు రావు . 
  • పేజీకి 16 నుంచి 20 లైన్లకు మించకుండా రాయాలి.
  • పేజీలో వాక్యాలు రాసేటప్పుడు వరుస క్రమం పాటించాలి.
  • పెన్ను సక్రమంగా పట్టుకుని రాస్తే అక్షరాలు గుండ్రంగా ఉంటాయి .
  •  సమాధానాలు రాసే సమయంలో ప్యాడ్ పైకి వాలిపోకుంగా సాధ్యమైనంత వరకు కూర్చుని రాయాలి . 
  • సామాన్య , భౌతిక శాస్త్రాల్లో బొమ్మలు గీసి భాగాలు వేసే విషయంలో పెన్ను గట్టిగా ఒత్తి పెట్టి రాయకూడదు .
  •  ఇలా చేస్తే పేపర్ వెనుకవైపు కూడా కనపడుతుంది . 
  • రైటింగ్ బాగుంటే పేపర్ మూల్యాంకనం చేసే వారు పూర్తి మార్కులు వేయడానికి అవకాశం ఉంటుంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "These are the principles to be followed in order to be good at handwriting"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0