Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Training for teachers from tomorrow

  • రేపటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ..
  • మూడు విడతల్లో శిక్షణ.
  • 1-5 తరగతులను బోధించే ఉపాధ్యాయులకు మాత్రమే శిక్షణ..
  • ఉపాధ్యాయులు వారికి కేటాయించిన తేదీల్లో శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది..
  • ఐదు రోజుల పాటు శిక్షణ..
  • ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు సైతం శిక్షణ..
Training for teachers from tomorrow

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలుకుని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది . ఇందులో భాగంగా ఉపాధ్యా యులకు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు శిక్షణ ఇచ్చేందుకు తొలుత ఉత్తర్వులు జారీ చేసింది . పరీక్షల సమయంలో టీచర్లకు శిక్షణ ఇస్తే ఆ ప్రభావం ఫలితాలపై చూపే ప్రమాదం ఉంది . ఈ నేపథ్యంలో ఎనిమిది రోజుల పాటు మూడు విడతలుగా ఇవ్వాల్సిన శిక్షణను ఐదు రోజుల పాటు మూడు విడ తల్లో శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం శనివారం మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది . మరో రోజు వ్యవధిలో శిక్షణ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంఈవోలతో డీఈవో ప్రత్యేక సమా వేశాన్ని శనివారం నిర్వహించారు . హైకోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోకుండా విద్యా శాఖ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది . ఇంగ్లీషు మీడియానికి సంబంధించి ఏమి చేసినా సదరు ఖర్చును అధికారులే భరిం చాలని కోర్టు స్పష్టం చేసిందని అధికారులు అంటున్నారు . అయినా ప్రభుత్వం ఇంగ్లీషు మీడియ అమలుకు కార్యా చరణకు దిగడం , దీనికి ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని కూడా నియ మించడం గమనార్హం .

శిక్షణ కొనసాగేనా ? 

ఇంగ్లీషు మీడియాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రభుత్వం తన వంతుగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందడుగు వేస్తోంది . ఇటీవల హైకోర్టు ఇంగ్లీషు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయవద్దని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది . సోమవారం నుంచి ఉపాధ్యా యులకు శిక్షణ ప్రారంభమైనా మొదటి విడత శిక్షణ పూర్తయ్యేలోగానే ఈ అంశంపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే శిక్షణ నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని ఉపాద్యాయులు అంటున్నారు . ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోకుండా ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయడం , కౌన్సెలర్లుకు ఇప్పటికే శిక్షణ ఇవ్వడం - నిబంధనలకు విరుద్దమేనని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి . సత్యనారాయణ అన్నారు . 

1 నుంచి 5 తరగతుల వరకే 

ఇంగ్లీషు మీడియాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . 1 నుంచి 5వ తరగతి వరకు , 1 నుంచి 7వ తరగతి వరకు , ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదివే విద్యారులకు ఇంగ్లీషు మీడియంలో బోధన చేయాలని గతంలో ఉత్తర్వు లు జారీ చేశారు . 10వ తరగతి పరీక్షలు మార్చి నెలలో , మిగిలిన తరగతుల పరీక్షలు ఏప్రిల్ నెలలో జరగనున్న నేపథ్యంలో దాదాపు నెల రోజుల పాటు శిక్షణ కోసం వెళితే ఆయా సబ్జెక్టులలో బోధన , పునశ్చరణ నిలిచిపో తుందని కొన్ని ఉపాధ్యాయ సంఘా నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు . సింగిల్ టీచర్ పని చేసే పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుడు . శిక్షణకు వెళితే అక్కడ ప్రత్యా మ్నాయం చూడాల్సిన అవసరం ఏర్పడింది . విద్యా బోధన ఎలా ఉన్నా , మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేం దుకైనా సింగిల్ టీచర్ పనిచేసే పాఠశాలలో మరో ఉపాధ్యాయుడిని ప్రత్యామ్నాయంగా పంపాల్సిన పరిస్థితి నెలకొంది . ఈ అంశంపై ఉపాధ్యాయ సం ఘాల నాయకుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు శని వారం ఈ ఉత్తర్వుల్లో మార్పులు చేశారు . 1 నుంచి 5వ తరగతి వరకు పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులు వారికి కేటాయించిన తేదీల్లో శిక్షణకు హాజరు కావాలని , ఈ శిక్షణ ఐదు రోజుల పాటే ఉంటుందని పేర్కొన్నారు . ఎయిడెడ్ పాఠశాలల్లో . . . . ప్రభుత్వం ప్రవేశపెట్టే ఇంగ్లీషు మీడియాన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే అమలుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి . 

ఎయిడెడ్ పాఠశాలల్లో 

ఇంగ్లీషు మీడియం ప్రవేశపె డతారా ? లేదా అనే అంశం స్పష్టత లేదు . అయితే ఎయి డెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు సైతం శిక్షణ ఇచ్చేం దుకు విద్యాశాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Training for teachers from tomorrow"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0