Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP CM JAGAN MOHAN REDDY LIVE ON KARONA

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడు చున్న లైవ్
AP CM JAGAN MOHAN REDDY LIVE ON KARONA

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యం లో ముఖ్యమంత్రి


  • 31 వరకు ఏపీలోనూ లాక్‌డౌన్‌
  •  కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఐసోలేషన్‌ ఒక్కటే మార్గమని, ఎవరూ తిరగకుండా, ఎవరున్న చోట వారు ఉండగలిగితే దీన్ని కట్టడి చేయగలమని సీఎం జగన్‌ అన్నారు
  • ఇప్పటికే 12 రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేశాయని, మన రాష్ట్రం కూడా అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నామని ప్రకటించారు.*
  • ఈ నెల 31 వరకు రాష్ట్రంలోనూ లాక్‌డౌన్‌ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు.
  • పదో తరగతి, ఇతర పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించాం
  • ఉద్యోగులకు విడతల వారీగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. విదేశాల నుంచి వచ్చేవారంతా 14రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రావద్దు. అత్యవసరమైతే తప్పక బయటకు రావద్దు. అందరూ ఇళ్లలోనే ఉండండి. ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి. కూరగాయలు, పాలు, మెడిసన్‌ కోసమే బయటకు రండి.  దేశంలో భయానక వాతావరణ ఉంది. 
  • ఇలాంటి సమయంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఇందుకు సహకరించాలని కోరుతున్నా. నిత్యావసర దుకాణాలు తప్ప అన్నింటినీ బంద్‌ చేస్తున్నాం. 
  • ఈ సమయంలో ధరలు పెరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.’’ అని తెలిపారు.

మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ సుభిక్షంగా ఉంది: సీఎం జగన్‌

  • మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ సుభిక్షంగా ఉందని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘కరోనా కట్టడికి కృషి చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా నివారణకు అధికారులు శ్రమిస్తున్నారు.
  • విదేశాల నుంచి వచ్చిన దాదాపు 11వేలమందిని స్క్రీనింగ్‌ చేశాం.  ప్రతి జిల్లా కేంద్రంలో 200 ఐసోలేటెడ్‌ పడకలు ఏర్పాటు చేస్తున్నాం.
  •   ప్రతి నియోజకవర్గంలో వంద ఐసొలేటెడ్‌ పడకలు ఏర్పాటు చేస్తున్నాం. విదేశాల నుంచి వచ్చిన వారితో తిరిగిన  వారు వెంటనే 104కు ఫోన్‌ చేయాలి. వైద్య చికిత్స తీసుకున్న తర్వాత కొందరు ఇళ్లకు వెళ్లారు.
  • కరోనా నివారణలో గ్రామ వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది కృషి గొప్పది’’ అని సీఎం జగన్‌ అన్నారు.
  • ఏపీలో లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం జగన్.
  • ప్రజా రవాణా నిలిపివేస్తున్నాం.
  • నిత్యావసర వస్తువులు మినహా అన్ని షాపులు క్లొజ్ చెయ్యాలి.
  • విదేశాల నుంచి వచ్చిన వారు తక్షణమే సమాచారం ఇవ్వాలి.
  • దేశం మొత్తం కరోనపై యుద్ధం చేస్తుంది.
  • ఏపీ అంతరాష్ట్ర సరిహద్దులు క్లోజ్ చేస్తున్నాం.
  • గోడౌన్లు, ఫ్యాక్టరీలు కార్యాలయాలు పరిమిత సిబ్బందితో నడపాలి.
  • ప్రజలు ఇళ్ళల్లోనే ఉండాలి.
  • అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావాలి.
  • విదేశాల నుంచి వచ్చి వారిని గుర్తించేందుకు పోలీసులు దృష్టి పెట్టండి
  • నిత్యవసర వస్తువుల ధరలను సిద్ధం చెయ్యాలి.
  • అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కేసులు పెడతాం.
  • రోజువారీ కార్మికులు జాగ్రత్తలు పాటించండి
  • అవసరాలను ఆసరాగా చేసుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవు
  • తప్పని సరి పరిస్థితిలో అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సి వస్తుంది
  • ఏపీలో 4.5శాతం మాత్రమే ఐసీయూ వెళ్లే అవకాశం ఉంది.
  • ఏపీలో ప్రస్తుతం కరోన అదుపులో ఉంది.
  • 14రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ చేస్తున్నాం
  • వృద్ధులను,పిల్లలను బయటకు రాకుండా చూడాలి.
  •  రేషన్ ఫ్రీగా ఇవ్వడంతో పాటు ఒక కేజీ కందిపప్పు ఉచితం... ఇస్తూ ఏప్రిల్ 4వ తేదీన ₹1000 నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది... ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..


CM LIVE PROGRAM 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP CM JAGAN MOHAN REDDY LIVE ON KARONA "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0