Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Directing awareness programs on education hygiene, alert on corona


  • కరోనాపై  అప్రమత్తమైన విద్యాశాఖ పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలకు ఆదేశం 
  • సెలవులపై రాని స్పష్టత 
  • పలు రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు


 ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తు న్న నావెల్ కరోనా వైరస్ ( కోవిద్ - 19 ) విషయంలో పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమైంది . వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అవసరమైన చర్యలను అన్ని పాఠశాలల్లో తీసుకోవాలని సూచనలు జారీ చేసింది . ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి . ప్రతాప్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు . కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం విద్యార్థులందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు . అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే ' ఆనంద వేదిక ' కార్యక్రమంలో పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని సూచించారు . విద్యార్థులంతా తరచుగా చేతులు శుభ్రపరుచు కోడం ( హ్యాండ్ వాష్ , దగ్గు , తుమ్ములు , జలుబుతో బాధ పడుతున్న విద్యార్థులు తప్పనిసరిగా చేతి రుమాలు ఉపయోగించేలా చూడటం , ఆరోగ్య సమస్యలు ఉన్న విద్యార్థులు సెలవు తీసుకోవడం వంటివి చేయాలని సూచనల్లో పేర్కొన్నారు . 
సెలవులపై సందిగ్ధం
 కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గుంపులు , సమూహాలుగా గుమిగూడటాన్ని నిరోధించడం ముఖ్యం . అందుకోసం దేశవ్యాప్తంగా పాఠశాలలు , విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది . అయితే ఈ ఆదేశాలకు పూర్వమే ఢిల్లీ , ఉత్తర్ ప్రదేశ్ , మహారాష్ట్ర , తెలంగాణ , హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులిచ్చాయి . తాజాగా తమిళనాడు , ఒడిశా , కర్ణాటక , ఈశాన్య రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాయి . అయితే మన రాష్ట్రంలో మాత్రం సెలవులు ఇవ్వాలా వద్దా అనే అంశంపై విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో సందిగ్ధత నెలకొంది . బుధవారం ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముందని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు . ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటేనే విద్యాసంసలన్నీ దాన్ని పాటించడానికి అవకాశం ఉంటుందని వారు తెలిపారు .

ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం . . . కరోనా వైరస్ నాలుగు దశలు

మొదటి దశ
చైనా , ఇటలీ , ఇరాన్ తదితర దేశాల నుంచి వచ్చిన వారికే కరోనా వైరస్ సోకే అవకాశాలున్నాయి . మన రాష్ట్రం ప్రస్తుతం ఈ దశలో ఉంది . రాష్ట్రంలో నమోదైన ఒకే ఒక్క కేసు ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు వాసిదే . ప్రస్తుతం ఈ యువకుడు కూడా పూర్తిగా కోలుకున్నాడు.
రెండవ దశ
విదేశాలకు వెళ్లి కరోనా బారిన పడి మనదేశానికి వచ్చిన వారి కుటుంబ సభ్యులకు ఈ వైరస్ సోక వచ్చు . ఈ దశను లోకల్ ట్రాన్స్మిషన్ అంటారు . ఈ దశలో బాధితుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశాలుంటాయి . దేశంలోని మహారాష్ట్ర , కర్ణాటక , కేరళ తదితర రాష్ట్రాలు ఈ దశలో ఉన్నాయి .
మూడవ దశ
ఇది ప్రమాదకరమైన దశ .  రెండో దశలో వైరస్ బారిన పడినవారి నుంచి చుట్టు పక్కల వారికి వైరస్ సోకుతుంది .
నాల్గవ దశ
వైరస్ తీవ్రత అమాంతంగా పెరుగుతుంది . బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది . ఇటలీ , ఇరాన్ ప్రస్తుతం ఈ దశలో ఉన్నాయి . చైనా సమర్థవంతంగా వ్యవహరించి ఈ దశలో కరోనా వైరసను చాలా వరకు కట్టడి చేయగలిగింది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Directing awareness programs on education hygiene, alert on corona"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0