Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Distribution of second stage of Jagananna Gorumuddalu from 1st April

ఏప్రిల్ 1నుంచి జగనన్న గోరు ముద్దలు రెండో దశ పంపిణీ.
Distribution of second stage of Jagananna Gorumuddalu from 1st April

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ రాష్ట్రంలో విద్యార్ధుల సంక్షేమాన్ని మాత్రం విస్మరించటం లేదు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించి ప్రభుత్వ పాఠశాలలకు సెలవులివ్వడంతో ఇళ్లకే పరిమితమైన పేద, మధ్యతరగతి విద్యార్థులకు 'జగనన్న గోరుముద్ద' ద్వారా బియ్యం, కోడిగుడ్లు, చిక్కీని వారి ఇళ్లకే పంపిణీ చేసింది.

మొదటి దశలో మార్చి 19 నుంచి 31 వరకూ తొమ్మిది పని దినాలను లెక్కగట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 45 వేల 753 ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 37 లక్షల మంది విద్యార్థులకు బియ్యం, కోడిగుడ్లు, చిక్కీని అందజేసింది.
ఇప్పుడు రెండో దశ కార్యక్రమాన్ని అమలు పర్చేందుకు అధికారులు సిధ్ధమయ్యారు.

ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 14 వరకూ తొమ్మిది రోజుల పాటు పాఠశాలల పనిదినాలను లెక్కించి ఆ మేరకు ఇళ్లలో ఉంటున్న విద్యార్థులకు సరుకుల పంపిణీ చేయాలని ప్రభుత్వం శనివారం ఉత్తర్వులిచ్చింది. కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల ఏప్రిల్‌ 14 తర్వాత కూడా పాఠశాలలను తెరవకుంటే విద్యాసంవత్సరం చివరి రోజైన 23 వతేదీ వరకూ లెక్కలోకి తీసుకుని మొత్తం 17 రోజులకు సరుకులు సరఫరా చేయనున్నట్టు రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం అధికారులు చెప్పారు. రెండో దశ పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్‌ ఒకటో తేదీన ప్రారంభించునున్నారు.

ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు కేజీ 700 గ్రాములు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 2 కేజీల 550 గ్రాముల చొప్పున బియ్యం అందిస్తారు. ఒక్కో విద్యార్థికి తొమ్మిది చిక్కీలు, 17 చొప్పున కోడిగుడ్లు ఇస్తారు. గ్రామ, వార్డు వలంటీర్లు, సిబ్బంది ద్వారా విద్యార్థుల ఇంటికి వెళ్లిమరీ వీటిని పంపిణీ చేయనున్నారు. గోరుముద్దలు పంపిణీ సమయంలో ఎంఈవోలు, హెచ్‌ఎంలు, వలంటీర్లు సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Distribution of second stage of Jagananna Gorumuddalu from 1st April"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0