Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Health tips: It is advisable to eat them regularly to increase the immunity

Health Tips : వ్యా ధి నిరోధక శక్తి పెరిగేందుకు రోజూ ఇవి తింటే మంచిది.
Health tips: It is advisable to eat them regularly to increase the immunity

Weight Loss : ఈ రోజుల్లో అధిక బరువు తగ్గడం , వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం కీలకం . అదెలాగో తెలుసుకుందాం .అధిక బరువు, బరువు తగ్గడం ఎలా?, బరువు తగ్గించే చిట్కాలు

మన శరీరంలో కొవ్వుకీ, విటమిన్ Cకి లింక్ ఉంటుంది. విటమిన్ సీ... సమృద్ధిగా ఉంటే... అది శరీర బరువును బ్యాలెన్స్ చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వేరే దారిలేక జంక్ ఫుడ్ తింటున్నవారికీ, రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌లు చెయ్యలేకపోతున్నవారికీ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. మనం తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలూ ఉండాలి. విటమిన్లూ, మినరల్స్‌ కలిగి ఉండాల. మీకు తరచుగా అలసట వస్తున్నా, మాటిమాటికీ మూడ్ మారిపోతున్నా, కండరాల్లో నొప్పులు వస్తున్నా, జుట్టు, స్కిన్ ఎండిపోతున్నా... మీకు సీ విటమిన్ తగ్గిపోతున్నట్లు లెక్క. మన శరీరానికి విటమిన్ సీ రెగ్యులర్‌గా అవసరం. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచడమే కాదు... శరీర కణాలు పాడవకుండా చేస్తుంది. అంతేకాదు... అధిక బరువును తగ్గించి... బాడీ మెటబాలిజం (అన్నీ సక్రమంగా పనిచేసేలా చెయ్యడం)ను సరిచేస్తుంది. విటమిన్ సీ రెగ్యులర్‌గా తీసుకోవడానికి ఈ పండ్లను తినాలి.
నిమ్మకాయ : మన మార్కెట్లలో ఏడాది మొత్తం దొరికే వాటిలో నిమ్మకాయలు ఒకటి. వీటిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. పైన చెప్పిన ప్రయోజనాలతోపాటూ... ఇంకా చాలా ఉపయోగాలుంటాయి నిమ్మకాయల రసం తీసుకుంటే. అందువల్ల రెగ్యులర్‌గా నిమ్మరసం తాగాలి. కొద్దిగా చక్కెర లేదా సాల్ట్ వేసుకొని తాగొచ్చు.

ఉసిరి : ఇదో అద్భుత ఔషధ గుణాలున్న కాయ. ఉసిరి కాయల్లో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉసిరికాయలు తిన్నా, వాటి రసం తాగినా బాడీలో చెడు బ్యాక్టీరియా చచ్చిపోతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ల వంటివి రావు. దగ్గు, జలుబు కూడా పరారవుతాయి. అందువల్ల వీలు దొరికినప్పుడల్లా... ఉసిరి కాయలు తినండి.

చెర్రీస్ : ఎరుపు రంగులో మెరిసిపోయే ఈ పండ్లలో పోషకాలు మెండుగా ఉంటాయి. విటమిన్ సీ చాలా ఎక్కువగా ఉంటుంది. రోజూ వీటిని తింటే... మనకు కావాల్సిన విటమిన్ సీ బాడీకి అందుతుంది. కాకపోతే, ఇవి కాస్త రేటు ఎక్కువే. అందువల్ల వీటిని ఎక్కువ మంది కొనుక్కోరు. అయినప్పటికీ... అప్పుడప్పుడైనా వీటిని తింటే మంచిదే.

మిగతా విటమిన్లలాగా... విటమిన్ సీ మన శరీరంలో స్టాక్ ఉండదు. బాడీలో వేడి పెరిగితే, విటమిన్ సీ బయటకు వెళ్లిపోతుంది. అందువల్ల దీన్ని మనం రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండాల్సిందే. పెద్దవాళ్లకు రోజుకు 40 మిల్లీ గ్రాముల విటమిన్ సీ అవసరం. ఐతే... ఇదే విటమిన్ ఎక్కువగా తీసుకున్నా... కడుపునొప్పి, డయేరియా (అతిసారం) వంటివి వస్తాయి. కాబట్టి... జాగ్రత్తగా సరిపడా తీసుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Health tips: It is advisable to eat them regularly to increase the immunity"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0