Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Education institutes bandh in AP

Education institutes bandh in AP
Education institutes bandh in AP

The AP government has taken a key decision as the coronavirus effect is steadily increasing in the country. It has decided to close down the educational institutions as part of pre-emptive measures to tighten the epidemic. The state has announced holidays for schools, colleges and universities from Thursday (tomorrow)


To strengthen ongoing measures to prevent & contain #COVID19 in #AndhraPradesh#government has decided to close all #Educational #Institutions with immediate effect. Strong advice to every person to act #responsibly & contribute to me mitigation of the #pandemic

— PV Ramesh (@RameshPV2010) March 18, 2020


కరోనా వైరస్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని విద్యాసంస్థలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఓ కరోనా పాజిటివ్ కేసు నమోదై ఉంది. ఇప్పటి వరకు అదనంగా ఎలాంటి కేసు కొత్తగా నమోదు కాలేదు. కరోనా పాజిటివ్ వ్యక్తికి చికిత్సకొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా ప్రబల కుండా ఇప్పటికే గట్టి చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఏపీలో విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద అడిషనల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న పీవీ రమేష్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లతో సహా అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్టు చెప్పారు. అయితే, ఎప్పటి వరకు అనే విషయాన్ని మాత్రం అందులో పేర్కొనలేదు. అయితే, పరీక్షలు మాత్రం యధావిధిగా జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా వైరస్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి.  ఆంధ్రప్రదేశ్ పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మార్చి 31 వరకు సెలవులను ప్రకటించారు. పరీక్షలు మాత్రం యధావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఇక కర్ణాటక, తమిళనాడులో కూడా గట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కూడా కరోనా వైరస్ నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా విద్యాసంస్థలకు సెలవులు 
ప్రకటించింది.

VIEW THE VIDEO

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Education institutes bandh in AP"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0