Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

EPF claim frauds, EPFO cyber frauds, EPF claim settlement, Employees Provident Fund Organisation, EPF claim scams

EPF Account : ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి హెచ్చరిక . . . ఈ విషయాలు మర్చిపోవద్దు.
EPF claim frauds, EPFO cyber frauds, EPF claim settlement, Employees Provident Fund Organisation, EPF claim scams

మీరు ఏదైనా సంస్థలో
పనిచేస్తున్నారా ? మీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లోకి డబ్బులు జమ చేస్తున్నారా ? అయితే మీరు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి .

మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉందా? మీ ఈపీఎఫ్ అకౌంట్‌ స్టేట్‌మెంట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నారా? మోసగాళ్లు ఈ మధ్య ఈపీఎఫ్ ఖాతాదారుల్ని టార్గెట్ చేస్తున్నారు. వివరాలన్నీ తెలుసుకొని సులువుగా మోసం చేస్తున్నారు.
ఈపీఎఫ్ క్లెయిమ్ మోసాలు, ఈపీఎఫ్ఓ సైబర్ మోసాలు, ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఈపీఎఫ్ స్కామ్
ఇలాంటి మోసాలపై ఖాతాదారుల్ని అప్రమత్తం చేస్తోంది ఈపీఎఫ్ఓ. సైబర్ నేరగాళ్లు ఈపీఎఫ్ ఖాతాదారుల్ని చాలా సింపుల్‌గా ఛీట్ చేస్తున్నారు. ముందుగా ఖాతాదారులకు ఓ ఫోన్ కాల్ వస్తుంది. తాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO అధికారులమని ఫోన్‌లోని వ్యక్తి పరిచయం చేసుకుంటారు. 

ఈపీఎఫ్ క్లెయిమ్ మోసాలు, ఈపీఎఫ్ఓ సైబర్ మోసాలు, ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఈపీఎఫ్ స్కామ్
మీ వ్యక్తిగత వివరాలు వెరిఫై చేయాలని నమ్మిస్తారు. మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, చివరి ఎంప్లాయ్‌మెంట్ వివరాలు, యూనివర్సల్ అకౌంట్ నెంబర్-UAN తెలుసుకుంటారు. అంతే... ఆ వివరాలతో అందులో సైబర్ నేరగాళ్ల బ్యాంకు అకౌంట్ వివరాలు అప్‌డేట్ చేసి క్లెయిమ్ చేసుకుంటారు. 

ఈపీఎఫ్ క్లెయిమ్ మోసాలు, ఈపీఎఫ్ఓ సైబర్ మోసాలు, ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఈపీఎఫ్ స్కామ్
ఈ విధంగా ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్‌లోని డబ్బులు దోచుకుంటారు. సరిగ్గా ఇదే పద్ధతిలో ఇప్పటికే ఈపీఎఫ్ఓ ఖాతాదారులు అనేక మంది మోసపోయారు. ఉద్యోగం మారిన వారినే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇలాంటి మోసాలపై ఈపీఎఫ్ఓ అధికారులకు వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. 

ఈపీఎఫ్ క్లెయిమ్ మోసాలు, ఈపీఎఫ్ఓ సైబర్ మోసాలు, ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఈపీఎఫ్ స్కామ్
ఈ మోసాలపై ఈపీఎఫ్ఓ ఖాతాదారులను అలర్ట్ చేస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సిబ్బంది ఎవరూ మీ ఆధార్, పాన్, యూఏఎన్ నెంబర్లను ఫోన్‌లో అడరగని, ఎవరైనా ఈపీఎఫ్ఓ అధికారి పేరుతో కాల్ చేస్తే నమ్మొద్దని, డబ్బులు డిపాజిట్ చేయమని అడిగితే పట్టించుకోవద్దని, ఫేక్ కాల్స్‌ని నమ్మి మోసపోవద్దని ఈపీఎఫ్ఓ హెచ్చరిస్తోంది. 

ఈపీఎఫ్ క్లెయిమ్ మోసాలు, ఈపీఎఫ్ఓ సైబర్ మోసాలు, ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఈపీఎఫ్ స్కామ్
 మీకు ఈపీఎఫ్ ఖాతాకు సంబంధించిన ఏవైనా అనుమానాలు ఉంటే నేరుగా అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే మీ ఫిర్యాదును రిజిస్టర్ చేయాలి. లేదా దగ్గర్లోని ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లాలి. ఎట్టిపరిస్థితుల్లో మీ వివరాలన్నీ ఇతరులకు చెప్పి మోసపోకూడదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "EPF claim frauds, EPFO cyber frauds, EPF claim settlement, Employees Provident Fund Organisation, EPF claim scams"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0