Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jan Dhan Account : జన్ ధన్ అకౌంట్ లోకి డబ్బులు . . . బ్యాంకులకు ఈ సమస్యలు.

Jan Dhan Account : జన్ ధన్ అకౌంట్ లోకి డబ్బులు . . . బ్యాంకులకు ఈ సమస్యలు.
Jan Dhan Account : జన్ ధన్ అకౌంట్ లోకి డబ్బులు . . . బ్యాంకులకు ఈ సమస్యలు.

PM Gareeb Kalyan Yojana | ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన లబ్దిదారుల్లో మీరూ ఉన్నారా ? మీ జన్ ధన్ అకౌంట్ పనిచేస్తూ ఉందా ? పనిచేయకపోతే నగదు బదిలీలో సమస్యలు రావొచ్చు . అందుకే బ్యాంకులు ఈ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాయి .

కరోనా వైరస్ మహమ్మారి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలు ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్నాయి. వారిని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. రూ.1,70,000 కోట్లతో 'పీఎం గరీబ్ కళ్యాణ్' స్కీమ్‌ను కూడా ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా అనేక వర్గాలను ఆదుకోనుంది కేంద్రం. నేరుగా వారి అకౌంట్‌లోకి నగదు బదిలీ చేసి ఆదుకుంటామని ప్రకటించింది. ఈ నగదు బదిలీ విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. జన్ ధన్ అకౌంట్లలో కొంతవరకు ఇనాపరేటీవ్‌గా అంటే పనిచేయకుండా ఉన్నాయి. అకౌంట్ ఓపెన్ చేసి వాటిని ఆపరేట్ చేయట్లేదని తేలింది. దీంతో నగదు బదిలీ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాయి బ్యాంకులు. అయితే కేవైసీ వివరాలన్నీ సరిగ్గా ఉండి, డబ్బులు జమ చేస్తూ ఉండకపోతే ఆ అకౌంట్లను రీయాక్టివేట్ చేయాలని బ్యాంకులు భావిస్తున్నాయి. పనిచేయకుండా ఉన్న ఆ అకౌంట్లను రీయాక్టివేట్ చేయడం ద్వారా లబ్ధిదారులకు డబ్బులు జమ చేయడం సులువవుతుంది.

జన్ ధన్ యోజన వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ప్రస్తుతం 38.28 కోట్ల అకౌంట్లు ఉన్నాయి. వాటిలో రూ.1,18,105.97 కోట్ల నగదు ఉంది. జనవరి 15 నాటికి వీటిలో 19 శాతం ఇనాపరేటీవ్‌గా ఉన్నాయి. అదే 2017 మార్చిలో ఇనాపరేటీవ్‌గా 40 శాతం అకౌంట్లు ఉండేవి. సాధారణంగా ఆరు నెలల నుంచి ఒక ఏడాది వరకు అకౌంట్‌లో ఎలాంటి లావాదేవీలు లేకపోతే బ్యాంకులు వాటిని ఫ్రీజ్ చేస్తాయి. మళ్లీ డాక్యుమెంటేషన్, కేవైసీ లాంటివి పూర్తి చేసిన తర్వాతే రీయాక్టివేట్ చేస్తాయి. కానీ ప్రస్తుతం బ్యాంకులే చొరవ తీసుకొని రీయాక్టివేట్ చేసే పనిలో ఉన్నాయి.
పీఎం గరీబ్ కళ్యాణ్' స్కీమ్‌లో భాగంగా 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతులకు ప్రస్తుతం లభిస్తున్న పెన్షన్ కన్నా అదనంగా రూ.1,000 లభిస్తాయి. జన్ ధన్ అకౌంట్లు ఉన్న 20 కోట్ల మహిళలకు నెలకు రూ.500 మూడు నెలల వరకు జమ కానుంది. వీరికే కాదు పీఎం కిసాన్ పథకంలో భాగంగా రైతులకు, ఉపాధి హామీ కూలీలకు కూడా డబ్బులు అందనున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jan Dhan Account : జన్ ధన్ అకౌంట్ లోకి డబ్బులు . . . బ్యాంకులకు ఈ సమస్యలు."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0