Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Health tips: What is good cooking oil? What does the experts say?

Health Tips : మంచి వంట నూనె ఏది ? నిపుణులు ఏం చెబుతున్నారు ?ఏ నూనె వాడాలో వివరణ.
ఉంటారు

Best cooking Oil : మీరు వాడుతున్నది మంచి నూనేనా ? మీకు వంటకు ఏ నూనె వాడాలో అర్థం కావట్లేదా ? ఈ స్టోరీ మీ కోసమే . నిపుణుల సలహా ఏంటో తెలుసుకుందాం . తద్వారా వంట నూనెను ఎలా వాడాలో కూడా తెలుసుకుందాం 
Best cooking Oil : వంట నూనె లేకుండా వంట చేయలేం. చేసినా టేస్ట్ ఉండదు. పైగా నూనె అనేది కూడా మనం తప్పక వాడుతున్న ఐటెం. ఐతే... ఏది మంచి నూనె అన్నది ఓ సమస్య. ఇందుకు సంబంధించి ఇంటర్నెట్‌లో మీరు చాలాసార్లు సెర్చ్ చేసే ఉంటారు. రకరకాల వీడియోలు చూసే ఉ0టారు  ప్రపంచవ్యాప్తంగా దీనిపై డిబేట్ జరుగుతూనే ఉంది. కంపెనీలు తమ ప్రతీ బ్రాండ్ నూనే మంచిదేనని అంటున్నాయి. మార్కెట్‌లో మనం ఎంచుకోవడానికి పదుల సంఖ్యలో బ్రాండ్లు ఉన్నాయి. వాటిలో బెస్ట్ ఏది? దీనిపై ఢిల్లీలో డాక్టర్ హెచ్ కే చోప్రా, న్యూట్రీషనిస్ట్ నీలంజన సింఘ్ వంటి వారు ఒకే వేదికపైకి వచ్చి చర్చించారు. గు0డెకు మేలు చేసేలా ఏ నూనె వాడాలి, ఎలా వాడాలో కనిపెట్టారు. అదేంటో తెలుసుకుందాం.
మంచి వంట నూనె ఏది : 
న్యూట్రీషనిస్ట్ నీలంజన ప్రకారం... మంచి వంట నూనె అనేదే లేదు. ఏ నూనే మన ఆరోగ్యానికి మంచిదని చెప్పలేం. ఒక్కో ప్రాంతం వారు ఒక్కో నూనె వాడుతున్నారు. ఉత్తరాదిన ఆవాల నూనె వాడుతున్నారు. సౌత్‌లో కొబ్బరి నూనె వాడతారు. ఇదే బెస్ట్ నూనె అనుకోవడం కరెక్టు కాదు. ప్రతీ నూనెలో ప్రత్యేక కొవ్వు, ప్రత్యేక లక్షణాలూ ఉంటాయి. ఇది మంచి నూనె, ఇది చెడ్డ నూనె అని అనుకోవడానికి వీల్లేదు.
రెండు రకాల నూనెల్ని కలిపి వాడటం ఎప్పుడైనా మంచిదేనని నీలంజన తెలిపారు. మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (MUFA) ఉండే నూనెల్ని వాడాలి. ఎందుకంటే MUFA అనేది మంచి కొవ్వు. అలాగే... పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ - PUFA అనేవి ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కలిగివుంటాయి. ఇవి మన బాడీకి చాలా అవసరం. ఎందుకంటే మన శరీరం వాటిని స్వయంగా తయారుచేసుకోలేదు. అందువల్ల వేర్వేరు నూనెల్ని కలిపివాడితే మేలు జరుగుతందని నీలంజన అభిప్రాయపడ్డారు.
ఏయే నూనెల్ని కలపాలి :
 సపోజ్ కొబ్బరి నూనెను వంటకు వాడేవారు... అన్నింటికీ కొబ్బరి నూనెనే వాడటం కరెక్టు కాదు. ఎందుకంటే కొబ్బరి నూనెలో ఫ్యాట్ ఎక్కువ. కొన్ని ఆహార పదార్థాల్ని వేరే నూనెతో వండటం మేలు. కొబ్బరి నూనెతో వంట చేసేవాళ్లు... రైస్ బ్రాన్ ఆయిల్, నువ్వుల నూనె వాడొచ్చు. ఎందుకంటే PUFA అనేది కొబ్బరి నూనెలో ఉండదు.
ప్రస్తుతం మార్కెట్లలో మిక్స్‌డ్ ఆయిల్స్ కూడా లభిస్తున్నాయి. ఆ ప్యాకెట్లను కొనుక్కొని డైరెక్టుగా వాడుకోవచ్చు. లేదంటే... వేర్వేరు ఆయిల్స్ కొనుక్కొని దేనికదే వాడుకోవచ్చు. ఎలా వాడినా... రెండు మూడు రకాల ఆయిల్స్‌ను వాడి వంటలు వండుకుంటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Health tips: What is good cooking oil? What does the experts say?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0