Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How is corona tightening? Arrangements taken by the Central Government

కరోనా కట్టడి ఎలా?కేంద్ర ప్రభుత్వం తీసుకొనే చర్యలు
How is corona tightening? Arrangements taken by the Central Government

ప్రపంచాన్ని కరోనా వైరస్​ వణికిస్తోంది. రోజురోజుకు విజృంభిస్తోన్న కరోనా వైరస్​ను అరికట్టేందుకు ప్రభుత్వం కొన్ని సూచనలిస్తోంది. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వ చర్యలు, పౌరుల బాధ్యతలను ఓ సారి పరిశీలిద్దాం..
విస్తృత వైద్య పరీక్షలు
కరోనా ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా వైద్య పరీక్షలు చేయించాలి. వైరస్‌ సోకినా లక్షణాలు కనిపించని వారిని గుర్తించేందుకు ఇతర ప్రాంతాల్లోనూ కొందరిని పరీక్షించాలి.
సేవల సామర్థ్యం పెంపు
విమాన-నౌకాశ్రయాలు, రోడ్డు రవాణాలోని ప్రయాణ ప్రాంగణాల్లో ప్రతి ఒక్కరినీ పరీక్షించాలి. ప్రయోగశాలల సామర్థ్యాలను పెంచాలి. పరీక్షల కిట్ల ఉత్పత్తిని వెంటనే రెట్టింపునకంటే అధికం చేసి, విరివిగా అందుబాటులో ఉంచాలి. ఆసుపత్రులకు సరిపడా వైద్యపరికరాలను సమకూర్చాలి.
'ప్రైవేటు' అనుసంధానం
అధునాతన పరికరాలకు, చక్కటి సేవలకు ప్రసిద్ధి చెందిన ప్రైవేటు ఆసుపత్రులను చికిత్సల్లో భాగం చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రులపై పెరిగే ఒత్తిడిని తగ్గించడానికి ఈ చర్యలు అవసరం.
చిరునామాల సేకరణ
అంతర్జాతీయ ప్రయాణికులు, పాజిటివ్‌ వచ్చిన వారి చిరునామాలను సేకరించాలి. ప్రాథమిక పరీక్షలు చేయించుకున్నా, వారిలో అప్పుడు వైరస్‌ పాజిటివ్‌ రాకున్నా... తర్వాత కాలంలో అందరి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీయాలి.
పౌరుల బాధ్యతలు
లక్షణాలను దాచిపెట్టొద్దు
విమానాలు, నౌకలు ఎక్కేముందు వైద్యుల సూచనలు లేకుండా ఉద్దేశపూర్వకంగా పారాసిటమాల్‌ మాత్రలు వేసుకోవద్దు. కరోనా లక్షణాలైన జ్వరం, పొడిదగ్గు గురించి పరీక్షలు చేసే వారికి తెలియజేయాలి.
ప్రత్యేక విభాగాలంటే భయమొద్దు
వైరస్‌ సోకినట్లు తేలితే వెంటనే ఆసుపత్రిలో చేరిపోవాలి. అక్కడి ప్రత్యేక ఏకాంత విభాగాలంటే భయపడొద్దు. ఇవి కరోనా వ్యాప్తిని అడ్డుకునేవేనని గ్రహించాలి
ప్రయాణాలను ఆపేయాల్సిందే
విదేశాలకు ప్రయాణాలు వద్దు. అత్యవసరమైతే తప్ప దేశీయంగానూ ప్రయాణాలొద్దు. ఒకచోట గుమిగూడి ఉండటాన్ని ప్రోత్సహించవద్దు.
సూచనలు పాటించాల్సిందే
ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలను పాటించాలి. ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు తగిన విధంగా సహకారం అందించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How is corona tightening? Arrangements taken by the Central Government"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0