Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

India is safe if the world's recession hits! '

ప్రపంచమంతా మాంద్యం వచ్చినా భారత్​ సేఫ్​!'

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమించింది కరోనా మహమ్మారి. అయితే ఈ​ సంక్షోభంతో భారత ఆర్థిక రంగానికి మాంద్యం ప్రమాదం ఉండకపోవచ్చని అంచనా వేసింది ఐక్యరాజ్యసమితి.

కరోనా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు మాంద్యం ముప్పు ఉండకపోవచ్చని అంచనావేసింది ఐక్యరాజ్యసమితి. వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటాయని.. అయితే భారత్, చైనా మాత్రం ఇందుకు మినహాయింపని విశ్లేషించింది.భారత్​, చైనా మినహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్న ప్రజానీకంపై వైరస్ తీవ్ర ప్రభావం చూపనుందని పేర్కొంది ఐరాస. ఆయా దేశాలను గట్టెక్కించేందుకు 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అవసరమని చెప్పింది. 'అభివృద్ధి చెందుతున్న దేశాలపై కొవిడ్-19 దెబ్బ: ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మంది జనాభా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం తీసుకోవాల్సిన చర్యలు' అనే అంశంపై ఐరాస వాణిజ్యం, అభివృద్ధి వేదిక (యూఎన్​సీటీఏడీ) పరిశోధన చేసింది. భారత్​పై కరోనా ప్రభావం పెద్దగా ఉండబోదని నివేదికలో పేర్కొన్నా... అందుకు కారణాలు వివరించలేదు. అయితే వస్తువుల ఎగుమతులపై ఆధారపడే దేశాలకు రెండు నుంచి మూడు ట్రిలియన్​ డాలర్ల మేర పెట్టుబడులు తగ్గే అవకాశం ఉందని లెక్కగట్టింది ఐరాస.తూర్పు ఆసియా దేశాల్లో 2019లో 5.8 శాతంగా ఉన్న వృద్ధిరేటు 2.1 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది.
 చైనా వృద్ధికి ఆకస్మిక దెబ్బ..
ప్రపంచ బ్యాంకు మాత్రం కాస్త భిన్నమైన నివేదిక విడుదల చేసింది. కరోనా సంక్షోభంతో చైనా ఆర్థిక వృద్ధి ఒక్కసారిగా స్తంభించే ప్రమాదముందని విశ్లేషించింది. తూర్పు ఆసియాలో 11 మిలియన్ల మంది పేదరికంలోకి జారుకునే ప్రమాదముందని హెచ్చరించింది. ఇదీ చూడండి: కరోనాపై పోరులో బ్యాంకుల పాత్ర అంత కీలకమా?

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "India is safe if the world's recession hits! '"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0