Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Salary as two installments for employees in AP

ఏపీలో ఉద్యోగులుకు రెండు విడతలుగా జీతం
Salary as two installments for employees in AP

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం జగన్‌ చెప్పినట్లు ఏపీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించారు. ఇవాళ సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నెలలో సగం వేతనం చెల్లిస్తామని, నిధులు సర్దుబాటు అయ్యాక మిగతా సగం చెల్లిస్తామని సీఎం చెప్పారని ఆయన అన్నారు. ఈ ఆపత్కాల పరిస్థితిలో రెండు విడతలుగా జీతం తీసుకునేందుకు ఒప్పుకున్నామని సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ ఒక్క నెల మాత్రమే రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం చెప్పారన్నారు.

మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అక్కడి ఉద్యోగులకు వేతనాల్లో కోత విధించిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ (కార్పొరేషన్‌)ల ఛైర్‌పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ లాంటి అఖిల భారత సర్వీసుల అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధించారు.
మిగతా అన్ని కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం (నాలుగో తరగతి మినహా), నాలుగో తరగతి, ఒప్పంద(కాంట్రాక్టు), పొరుగు సేవల (ఔట్‌ సోర్సింగ్‌) ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం వేతనాలకు కోత పడనుంది. అంతేకాకుండాఅన్ని రకాల విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో 50 శాతం, నాలుగో తరగతి విశ్రాంత ఉద్యోగుల పింఛనులో 10 శాతం కోత విధిస్తారు.అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల మాదిరిగానే వేతనాల్లో కోత ఉంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ సోమవారం వెల్లడించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Salary as two installments for employees in AP"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0